Health Problems : ఇవి తిన్న తర్వాత అస్సలే టీ, కాఫీలు తాగొద్దు.. తాగితే ఇక అంతే!
Health Problems : ఫుడ్ కాంబినేషన్ లో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ చిన్న తప్పులే ఆరోగ్యానికి చాలా హాని కల్గిస్తాయి. అయితే చాలా మంది టీ తాగిన తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటుంటారు. అంతే కాకుండా కొన్ని పదార్థాలు తిన్న వెంటనే టీ తాగుతుంటారు. కానీ అది మంచిది కాదు. టీ తాగితే కాస్త ఉపశమనం లభించడం.. రుచి బాగుండటం వల్ల తరచుగా తాగుతుంటారు. కానీ దీని వల్ల సైడ్ ఎపెక్ట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి సమస్యల బారిన పడతారు. పరగడుపున టీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. కొన్ని పదార్థాల తర్వాత టీ తీసుకోకపోవడం మంచిది.
అలాంటి కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా చల్లటి పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్, ఐస్ క్రీమ్స్ వంటివి తిన్న తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. నిజానికి చల్ల పదార్థాలు తిన్న తర్వాత వేడి వేడి టీ తాగడం వల్ల దంతాలు జలదరిస్తాయి. అలాగే చిగుళ్లు బలహీన పడవచ్చు. మీరు ఏదైనా చల్లటి ఆహారాలు తిన్న తర్వాత టీ తాగాలనుకుంటే అరగంట గ్యాప్ తీసుకోవాలి. అలాగే నిమ్మరసం, షర్బత్ వంటివి తాగిన వెంటనే అస్సలే టీ తాగకూడదు.అయితే దీని తర్వాత టీ తాగడం తప్పని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఉబ్బరం, ఆమ్లత్వం కల్గిస్తుంది. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రబావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉండే యాసిడ్..
టీ కలయిక కుపును దెబ్బతీస్తుంది. అనారోగ్యాని గురి చేస్తుంది. అలాగే పకోడి తిన్న తర్వాత కూడా టీని తాగకూడదు. చాలా మంది ఇంట్లో చేసిన చిరుతిల్లకు కాంబినేషన్ గా టీ ని తాగుతుంటారు. కానీ దీని వల్ల జీర్మ వ్యవస్థపై చెడు ప్రబావం ఉంటుంది. శనగ పిండితో చేసిన పదార్థాలు తిన్న 40 నిమిషాల తర్వాత టీ తాగితే మంచిది. అయితే చాలా మందికి ఆకలి వేసి తినడానికి ఏమీ అందుబాటులో లేనప్పుడు టీ తాగుతుంటారు. దీని వల్ల ఆకటి వెంటనే తగ్గిపోతుంది. అయితే ఖాళీ కడుపుతో టీ తాగితే హృదయ స్పందన రేటులో మార్పు చోటు చేసుకుంటుంది. దీనికి కారణంగా టీ పౌడర్ లో ఉండే కెఫిన్ శరీరంలో చాలా వేగంగా కరిగిపోతుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది హృదయంపై ప్రభావం చూపుతుంది. ఇది కాల క్రమేణా హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.