Health Problems : ఈ వ్యాధులు ఉన్నవారు… దీనిని తిన్నారంటే….ఈ సమస్యలు తథ్యం….?
ప్రధానాంశాలు:
Health Problems : ఈ వ్యాధులు ఉన్నవారు... దీనిని తిన్నారంటే....ఈ సమస్యలు తథ్యం....?
Health Problems : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలని తినాలి. కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మరికొన్ని కూరగాయలు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే.. కూరగాయలని అస్సలు తినకూడదు. ఆ కూరగాయ పేరు, కూరగాయలకే రారాజుగా పిలవబడే “వంకాయ “. కాయ కూర వండితే ఎవరైనా సరే వంకాయ కి దాసోహం అవ్వాల్సిందే. వంకాయలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఊదా రంగును కలిగిన వంకాయ తో రుచిగాను అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వీరు తినకూడదు. వంకాయ తినకూడని వారు కొందరు ఉన్నారు. గర్భధారణ సమయంలో వంకాయ తినకూడదని చాలామంది వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు. దీనికి కారణం సాధారణంగా అమోనోరియా ఫ్రీమె న్స్ట్రు వల్ డిజార్డర్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఇంతే కాదు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ వంకాయ విషయంలో నోరు కట్టుకోవాల్సిందే… మరి తినకూడని వారెవరు తెలుసుకుందాం.

Health Problems : ఈ వ్యాధులు ఉన్నవారు… దీనిని తిన్నారంటే….ఈ సమస్యలు తథ్యం….?
ఈ వంకాయలో ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. అవి, ఫోలెట్, మెగ్నీషియం,పొటాషియం, విటమిన్ బి3, బి6 బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు ఇది అధిక బరువును అంతరించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు, రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడంలో అంకయ్య కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఆరోగ్య నిపుణుల వంకాయలు కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు.
Health Problems వీటితో వంకాయ కలిపి తినకండి
కొన్ని అధ్యయనాలలో వంకాయలు తక్కువ టైంలో గ్యాప్ లో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసింది. పాలు వంకాయలు కలిపి జీర్ణం కావడం కష్టం. దీనివల్ల మలబద్ధకం కడుపునొప్పి ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా,వంకాయలు ఉన్న ఆహారం తిన్న తర్వాత పాలు తాగితే జీర్ణ క్రియ దెబ్బతింటుంది. సాధారణ లక్షణాలు కూడా కనిపిస్తాయి. వంకాయ వేడు స్వభావం ఉంటుంది. పెరుగు చలువ చేస్తుంది. ఈ రెండు కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇలా తింటే కూడా జీల సమస్యలు వస్తాయి. ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ. పరిశోధనలో వంకాయలను పెరుగుతో కలిపి తినకూడదని తెలియజేశారు. కొంతమందికి భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉంటుంది. నీ వంకాయ తిన్న వెంటనే టీ తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. టీ అనేది టానిక్ అధికంగా ఉండే పానీయం. వంకాయలో ఇనుము ఉంటుంది. ఇనుము ఉండడం చేత సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది.
ఎర్ర మాంసం జీర్ణం అయ్యే ప్రక్రియ చాలా సమయం పడుతుంది. అదేవిధంగా, వంకాయలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని కలిపి తింటే కడుపులో అజీర్ణం ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణం అవుతుంది.
వంకాయలు ఎవరు తినకూడదు: రక్తహీనతతో బాధపడేవారు, వంకాయ శరీరంలో ఇనుము శోషణ తగ్గిస్తుంది. అలర్జీ సమస్య ఉంటే వంకాయ కొంతమందికి చర్మ సమస్యలు, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. వంకాయలో ఉండే కొన్ని పదార్థాలు కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంది. కళ్ళల్లో మంటలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఈ వంకాయలకు దూరంగా ఉండాలి. కళ్ళల్లో ఏ సమస్య ఉన్న చికాకు లేదా వాపు ఉంటే, వంకాయ తినకండి, మీరు మూల వ్యాధితో బాధపడుతుంటే వంకాయ తినకూడదు. ఎందుకంటే అది మీ సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులతో బాధపడేవారు వంకాయలను అస్సలు తినకూడదు.