Tulasi Plant : తులసి మొక్కతో పాటు ఈ మొక్కలని పొరపాటున కూడా నాటకండి… మీరు సమస్యలో పడినట్లే…!
Tulasi Plant : ఇందు సాంప్రదాయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ తులసి మొక్కని లక్ష్మి స్వరూపంగా కొలుస్తుంటారు. ఈ తులసి మొక్కని ఆడవారు ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. చాలామంది నిత్యం తులసిని తప్పక పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కకి నీటిని నైవేద్యంగా సమర్పించి నిత్యం ఆరాధించడం వలన విష్ణు కూడాసంతోషపడతాడు. అదేవిధంగా తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు కలగజేస్తుంది. కానీ మనలో చాలామంది తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను పెంచుతూ ఉంటారు. తులసి మొక్క దగ్గర కొన్ని మొక్కలను అసలు పెంచకూడదు.
ఈ విధంగా చేయడం వలన తులసి శక్తి తగ్గిపోతుంది. ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. తులసి చుట్టూ ఏయేమొక్కలు నాటకూడదో చూద్దాం.. జిల్లేడు మొక్క: కొందరు తులసి తో పాటు అదే కుండీలో జిల్లేడు మొక్కను కూడా నాటుతూ ఉంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. చాలాసార్లు జిల్లేడు మొక్కల నుంచి పాలు కారుతూ ఉంటాయి. ఆ పాలు తులసి మొక్కపై పడితే తులసి పాడవుతుంది.ఫికస్ మొక్క : ఈ ఫికస్ మొక్కను తులసి దగ్గర పెంచడం మంచిది కాదు. ఈ మొక్క తులసి చెట్టు ఉన్న శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ప్రజలు తమ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ తులసి మొక్క దగ్గర ఉంచినట్లయితే అది దాని నుండి సానుకూల శక్తిని కూడా గ్రహిస్తూ ఉంటుంది. కాక్టస్ : తులసి మొక్క పక్కన ఈ మొక్కని ఎప్పుడు పెంచకండి. కాక్టస్ లో ముళ్ళు ఉన్నాయి. అందుకే దీన్ని రాహు కేతుహనంగా భావిస్తూ ఉంటారు. ఈ మొక్క వలన ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. దీని వలన తులసి మొక్క బలం నిత్యం తగ్గుతుంది. ఇది అస్సలు తులసి మొక్క పక్కన పెంచవద్దు.
ఈ కాక్టస్ మొక్కను పెంచకపోవడానికి ఇంకొక కారణం ఉంది తులసి మొక్కను ఈశాన్యంలో పెంచుతారు. కాబట్టి రెండు మొక్కలు ఎప్పుడు పక్కపక్కనే అస్సలు పెంచకూడదు.