TEA : కాళీ కడుపుతో ఉదయాన్నే టీ తాగుతున్నారా.? మీరు డేంజర్ లో పడ్డట్టే…!
TEA : టీ, కాఫీలు ఇవి లేకుండా చాలామంది జీవితం ముందుకి నడవదు.. ఉదయాన్నే టీ, కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టలేరు.. టీ, కాఫీలకు చాలామంది బాగా అలవాటై ఉంటారు. అవి మానేయాలంటే చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పరిగడుపున టి తీసుకోవడం వలన ఎస్ డిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ టి అనేది మెదడుని శరీరాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్న మాదిరిగా టీ ఎక్కువగా తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు టీ తీసుకోకూడదు ప్రధానంగా చాలామంది పరిగడుపున ఉదయాన్నే టీ కాఫీలు తీసుకుంటూ ఉంటారు.
అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళు ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే ఇలా ఖాళీ కలుపుతూ టీ తీసుకోవడం అసలు ఆకలి అనిపించదు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు దీనివలన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు… కాళీ కడుపుతో వేడి వేడి టీ తీసుకోవడం వలన పొట్టలో ఆసిడ్ లెవెల్స్ పెరిగి జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి అజీర్తి గుండెల్లో మంట లాంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అలాగే తలనొప్పిని తగ్గించేందుకు చాలామంది టీ ని తీసుకుంటూ ఉంటారు.
ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ అధికంగా తీసుకోవడం వలన నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. టి తీసుకోవడం వలన బర్నింగ్ సెన్సేషన్స్ వాంతులు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇది ఇతర పొట్ట సంబంధిత సమస్యలను కూడా కలిగేలా చేస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం నోటి దుర్వాసన కూడా కలుగుతుంది. నోటి ఆరోగ్యం కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. నిద్ర సమస్యతో పాటు… ఇక ఉదయం పూట టీ తీసుకోవడం వలన డిహైడ్రేట్ అయి మలబద్దకం వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. ఉధరంలోని ద్రవాల యాసిడ్ బేస్ ఆల్కలిన్ బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంటాయి. యాసిడ్ రిప్లై కూడా కలుగుతుంది. ఇలా దీనివలన గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.