Health Benefits : నానబెట్టిన సోంపు వాటర్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…!!
Health Benefits : భోజనం చేసిన వెంటనే ఎంతోమందికి సోంపు తినడం అలవాటు. మరికొందరైతే ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపు నానబెట్టిన నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఈ సోంపు ను ఎలా తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సోంపు గింజలతో నానపెట్టిన నీళ్ళు డిటాక్స్ వాటర్ గా కూడా చేస్తాయి. అలాగే జీర్ణ ఆరోగ్యానికి కూడా ఈ సోంపు అనేది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఉబ్బరం, అజీర్ణం గుండెల్లో మంట లాంటి సమస్యలకు కూడా ఈ సోంపు ఉపయోగపడుతుంది. ఈ సోంపు గింజలను నమిలి తీసుకోవడం వలన నోటి దుర్వాసన అనేది దూరం మవుతుంది. ఈ సోంపు గింజలలో సహజమైన యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి.
ఇది నోటి దుర్వాసనను పోగొట్టటమే కాక చిగుళ్ల ఆరోగ్య న్ని కూడా ఎంతగానో రక్షిస్తుంది. ఈ సోంపు గింజలలో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడతాయి. ఈ సోంపు గింజలు అనేవి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది… ఉదయం పూట నిద్రలేచిన తర్వాత ఎంతోమందికి తల తిరగటం,వికారం, అలసట లాంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మార్నింగ్ సిక్ నెస్ అని అంటారు. అయితే ఎంతో మంది మహిళలు గర్భధారణ టైంలో ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే ఈ టైంలో ఫెన్నెల్ టీ ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే మీరు ఉదయాన్నే సోంపు నానబేట్టిన నీటిని లేక టీ ని తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ అనేవి బయటకు పోతాయి. ఇవి కాలేయం మరియు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాక కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది… సోంపుతో నానబెట్టిన నీటిని లేక టీ ని నిత్యం తీసుకోవడం వలన ఉబకాయ సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఈ సోంపు గింజలు అనేవి బరువును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అయితే భోజనం చేసిన తర్వాత ఈ సోంపును నమలడం వలన ఈ విధమైన ప్రయోజనాలను మీరు పొందుతారు. అలాగే ఈ సోంపులో యాంటీ ఇన్ ప్లమెంటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ సోంపు గింజలు అనేవి శారీరక మంటను మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి. కావున మీరు నిత్యం ఉదయం సోంపుతో నాన బేట్టిన నీటిని తీసుకోండి…