Coconut Water : కొబ్బరినీళ్లు ఏ టైమ్ లో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?
ప్రధానాంశాలు:
Coconut Water : కొబ్బరినీళ్లు ఏ టైమ్ లో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?
Coconut Water : ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగా కొబ్బరి బోండం తాగుదామని అనుకుంటారు జనాలు. ఎందుకంటే ఎండలో తిరిగే వారు డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఇలా కొబ్బరి నీటిని తాగాలని అనుకుంటారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో అంతటి విటమిన్స్ ఉంటాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ కాకుండా చూసేందుకు కొబ్బరినీళ్లు బాగా ఉపయోగపడుతాయి. ఇక కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా హుషారుగా ఉండొచ్చు. దాంతో పాటు కొబ్బరి మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. బాడీలో ఉండే వేడిని దూరం చేస్తుంది. దాంతో పాటు కొబ్బరి నీళ్లను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Coconut Water : ఖాళీ కడుపుతో తాగితే..
అయితే చాలామందికి కొబ్బరి బోండాలు ఎప్పుడు తాగాలో తెలియక ఇష్టం వచ్చిన సమయంలో తాగేస్తుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కొబ్బరి నీళ్లను కూడా సమయాన్ని బట్టి తాగాలి. అంతే గానీ.. ఇష్టం వచ్చినసమయంలో తాగితే మాత్రం కచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాలు మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఖాళీ కడుపుతో కొందరు కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆరోగ్య నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.ఇంకో విషయం ఏంటంటే భోజనం చేసిన వెంటనే కొబ్బరి నీళ్లను అస్సలు తాగొద్దు. కాకపోతే గుండెల్లో మంట సమస్య ఉండే వారు మాత్రం ఖాళీ కడుపుతో తాగాలి. అప్పుడే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఖాళీ కడుపుతో తాగితే జీవక్రియ పెరుగుతుంది. దాంతో పాటు బరువును కూడా తగ్గించేందుకు సాయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగినప్పుడు కడుపులో ఉండే మలినాలను ఇది క్లీన్ చేస్తుంది. దాంతో పాటు కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం తినే ఆహారంలోని పోషకాలు బాడీకి అందజేయడంలో సాయం చేస్తుంది. దాంతో పాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.దాంతో పాటు ఇతర సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం కూడా తాగొచ్చు. దానికి తోడు సమ్మర్ సీజన్ కాబట్టి కొబ్బరి నీళ్లు తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలకు మేలు జరుగుతుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు కొబ్బరి నీళ్లు తాగితే మంచి జరుగుతుంది. మూత్ర పిండాలు దెబ్బతినకుండా ఉంటాయి.