Sweating : శరీరానికి చెమట పట్టకపోయినా దుర్వాసన ఎందుకు వస్తుందో తెలుసా..?
Sweating : సహజంగా అందరికీ గాలి మన శరీరానికి తగలనప్పుడు శరీరం చెమట పట్టడం సహజం. ఆ చెమట ఫలితంగా శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే.. అయితే శరీరం చెమట పట్టకపోయినా దుర్వాసన ఎందుకు వస్తుందో మీకు తెలుసా..? అసలు చెమటకి దుర్వాసన అంటూ ఉండదు. అంటే వాసన ఉండదు. శరీర దుర్వాసనపై శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో కొన్ని కొత్త సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారంగా శరీరంలో చెమటతో రెండు రకాల గ్రంధులు ఉంటాయి.
మొట్టమొదటి గ్రంధి క్రైమ్ స్వేద గ్రంధులు ఇది వాసన లేని నీటిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే చెమటలు పడుతూ ఉంటాయి. ఇక రెండవ గ్రంధి అపోక్రిన్ చెమట గ్రంధులు ఇది వాసనకి కారణమవుతూ ఉంటుంది. సహజంగా వెంట్రుకలు ఉన్న చోటులో దుర్వాసన ఉత్పత్తి చేసే గ్రంధులు ఉంటాయి. ఇది చమురులాంటి రసాయనాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ కెమికల్ వలన శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. దాని వలన ఒక మనిషి ఆందోళన, ఒత్తిడి నొప్పిని తో ఇబ్బంది పడుతున్నప్పుడల్లా లేదా సెక్స్ కోసం ప్రేరేపించినప్పుడు ఈ గ్రంధి మరింత యాక్టివ్గా తయారవుతుంది.
ఎక్కువ కెమికల్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. దాని ఫలితంగా శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ గ్రంధి నుంచి బయటికి వచ్చే జిడ్డు గల ద్రవానికి వాసన అస్సలే ఉండదు. ఉండే బ్యాక్టీరియాతో సంబంధం వచ్చినప్పుడు బ్యాక్టీరియా ఆయిల్ ను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తూ ఉంటుంది. ఈ విధంగా గ్రంధి నుండి వచ్చే ఆయిల్ దుర్వాసనను ఉత్పత్తి చేసే సమ్మేళనంగా మారుస్తుంది. అపోక్రిన్ చెమట గ్రందులు యవ్వనం వరకు సహజంగా యాక్టివ్ గా ఉండవు. కావున చిన్న వయసులో శరీరం దుర్వాసన అనేది బయటికి రాదు అందుకే చిన్న పిల్లలుకు చెమట పట్టినప్పుడు వాళ్ల నుంచి దుర్వాసన అనేది రాదు..