Eye Health : మీరు చీకటిలో మొబైల్స్ ఎక్కువగా చూస్తున్నారా …ఇది తెలిస్తే ఈ పొరపాటు లైప్ లో చెయ్యరుగా …?
ప్రధానాంశాలు:
Eye Health : మీరు చీకటిలో మొబైల్స్ ఎక్కువగా చూస్తున్నారా ...ఇది తెలిస్తే ఈ పొరపాటు లైప్ లో చెయ్యరుగా ...?
Eye Health : ప్రస్తుత కాలంలో ప్రజలు మొబైల్ Mobile Phone ఫోన్లకే అతుక్కొని Eye Health పోతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా, అందరూ మొబైల్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మొబైల్స్ వాడకం ఒక వ్యసనంలా మారిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ మొబైల్ ఫోన్లకి బానిసలై పోతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్ ఫోన్లను చూసేటప్పుడు వెలుతురులో చూడాలి. కానీ నేటి సమాజంలో చీకట్లో కూడా విస్తృతంగా ఫోన్లను వినియోగిస్తున్నారు. పడుకునే సమయంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలా చేయటం వలన కంటి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చీకట్లో అదే పనిగా ఫోన్లు చూడటం వల్ల వీటి నుంచి వెలువడే నీలి కాంతి కళ్ళ రెట్టిన ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది..
కానీ ప్రస్తుతం చాలామంది ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి, పడుకునే వరకు చేసే చివరి పని మొబైల్ ఫోన్ చూడటం. ప్రస్తుత కాలంలో ఈ చర్య సర్వసాధారణమైపోయింది. వెలుగులో కన్నా చీకట్లో మొబైల్ ఫోన్ల వాడకం నానాటికి మితిమీరిపోయింది. రోజువారి పనులు ముగిశాక, మొబైల్ ఫోన్ల మీద కన్ను వేయకపోతే చాలామందికి నిద్ర పట్టదు. అది పిల్లలు కావచ్చు,పెద్దలకు కావచ్చు. నిజానికి, ఇలా రాత్రిపూట చీకట్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అయితే కొంతమంది తమ వరకు కొరకు రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా స్క్రోల్ చేయటం, ఈమెయిల్ చెక్ చేయటం, ఫోన్లో వీడియోలు చూడటం వంటివి సార్వసాధారణమైపోయాయి. కటిక చీకటిలో ఫోనుని ఉపయోగించడం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. చీకటిలో ఫోన్లు చూస్తున్నప్పుడు, చుట్టూ చీకటి ఉండటం వల్ల, కళ్లపై ప్రకాశవంతమైన కాంతి పడుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మెదడుపై, అలాగే నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. రాత్రి సమయంలో ఫోన్లు ఎక్కువ చూడటం వల్ల నిద్రలేని సమస్య కూడా వస్తుంది.
Eye Health : చీకట్లో మొబైల్ ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు ఇవే
బ్లూ లైట్ వల్ల చెడు ప్రభావాలు : మొబైల్ ఫోన్స్, మరియు ఇతర డిజిటల్ పరికరాల ద్వారా వెలువడే నీలి కాంతి, కల్లారెడ్డి నాపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ద్వారా ఇది కంటిని అలసటకు గురిచేస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్, దృష్టి క్షీణతకు దారితీస్తుంది. కావున రాత్రిపూట లైట్లు లేకుండా చీకటిలో కూర్చొని ఫోన్లు ఉపయోగించడం మంచిది కాదు. వీలైనంతవరకు వెలుతురులో ఉండే ఫోన్ లని వినియోగించాలి. ఇతర డిజిటల్ పరికరాలను కూడా వెలుతురులో నే వినియోగించాలి. ఇలా చేస్తే కళ్ళు అంతా ప్రమాదానికి గురికావు.