Curd : పెరుగు పుల్లగా ఉందని పారేస్తున్నారా… ఈ టిప్స్ పాటించండి…పులుపు ఇట్టే మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd : పెరుగు పుల్లగా ఉందని పారేస్తున్నారా… ఈ టిప్స్ పాటించండి…పులుపు ఇట్టే మాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 August 2024,2:06 pm

ప్రధానాంశాలు:

  •  Curd : పెరుగు పుల్లగా ఉందని పారేస్తున్నారా... ఈ టిప్స్ పాటించండి...పులుపు ఇట్టే మాయం...!

Curd : మన రోజు వారి ఆహారంలో పెరుగు లేకుండా ఆహారం అనేది పూర్తి కాదు. అయితే పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. ఈ పెరుగు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెరుగు ఎన్నో రకాల వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. అంతేకాక రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని ప్రతిరోజు ఒక గిన్నె డు తీసుకున్నట్లయితే అంతకు మించిన ఔషధం మరొకటి లేదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అయితే ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఇంట్లో తయారు చేసినటువంటి పెరుగు ఎక్కువ కాలం నిల్వ చేయడం అనేది సాధ్యమైన పని కాదు. అది వెంటనే పాడైపోతుంది. దీంతో మార్కెట్లో దొరికే పెరుగు పైన ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే. పెరుగును ఎక్కువ కాలం ఉంచితే దాని రుచి మరియు పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. పెరుగును ఎక్కువసేపు ఉంచితే దాని రుచి ఎంతో పుల్లగా మారుతుంది. అప్పుడు ఈ పెరుగును అసలు మనం తినలేము. అప్పుడు పెరుగును పారేయడం తప్పితే మరొక మార్గం లేదు. ఇలా కాకుండా ఉండాలి అంటే. కొన్ని చిట్కాలను ట్రై చేయండి. అయితే ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

Curd పెరుగు పుల్లగా ఉందని పారేస్తున్నారా ఈ టిప్స్ పాటించండిపులుపు ఇట్టే మాయం

Curd : పెరుగు పుల్లగా ఉందని పారేస్తున్నారా… ఈ టిప్స్ పాటించండి…పులుపు ఇట్టే మాయం…!

పెరుగులో ఎక్కువ పులుపులు నియంత్రించడానికి పెరుగులో ఉన్న నీటిని తొలగించాలి. ఈ పెరుగులో నీటి శాతం అనేది అధికంగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి. తర్వాత మళ్లీ దానిలో చల్లటి నీళ్లను పోసుకొని చెంచాతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా పెరుగును నీటితో కలుపుతున్నప్పుడు పెరుగు మిగడ కరగకుండా ఎంతో జాగ్రత్త పడాలి. దాని తర్వాత స్టైనర్ సహాయంతో పెరుగును వడకట్టి నీటిని వేరు చేసుకోవాలి. పెరుగు నుండి నీటిని బయటకు తీసిన తర్వాత ఒక గిన్నె నిండా చల్లటి పాలను అందులో పోయాలి. దాని తర్వాత పెరుగును రెండు మూడు గంటలు అలాగే వదిలేయాలి. ఈ పెరుగు మొత్తాన్ని బట్టి పాలను తీసుకోవాలి. ఈ చిట్కా అనేది పెరుగులోని ఎక్కువ కొలుపును తగ్గిస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది