Tea : పరిగడుపున మిల్క్ టీ తాగుతున్నారా… ఈ సమస్యలు తప్పవు…!
ప్రధానాంశాలు:
Tea : పరిగడుపున మిల్క్ టీ తాగుతున్నారా... ఈ సమస్యలు తప్పవు...!
Tea : ప్రస్తుత కాలంలో టీ అనేది మన జీవితంలో ఒక భాగం అయింది అని చెప్పొచ్చు. ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ పడుకోబోయే వరకు ఎన్నోసార్లు మనం టీ ని తాగుతూ ఉంటాము. అయితే చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడివేడి టీ తాగకుండా రోజును మొదలుపెట్టలేరు. ఒక కప్పు టీ తాగితే గాని నిద్రమత్తు కూడా వదలదు. నిజం చెప్పాలంటే. టీ అనేది మన దేశం అంతటా కూడా ఎంతో ప్రజాదరణ పొందిన పానీయం. దేశ వ్యాప్తంగా ఇతర రకాల టీలు అందుబాటులో ఉన్నారు. అయితే గ్రీన్ టీ కంటే కూడా పాలటీ ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఖాళీ కడుపుతో పాల టీ తాగటం అసలు మంచిది కాదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పోషకాహార నిపునులు చెబుతున్నది ఏమిటి అంటే. ఈ టీ అనేది శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు..
ఖాళీ కడుపుతో మిల్క్ టీ ని తీసుకోవటం వలన మన శరీరాన్ని డిహైడ్రేషన్ చేస్తుందట. ఇది గ్యాస్ హార్ట్ బర్న్ సమస్యలను మరింతగా పెంచుతుంది అని చెబుతున్నారు. పాల టీని ఎక్కువసార్లు ఉడకబెట్టడం వలన పాలలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చాలా వరకు నాశనం అవుతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇలాంటి టీ ని తీసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరిగడుపున మిల్క్ టీ ని తీసుకోవటం వలన పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. అలాగే చాలా మంది టీలో చక్కెర లేకుండా తాగలేరు.
ఈ టీ లో గనక చక్కెర వేసుకున్నట్లయితే హానికరమైన ద్రవాలు అనేవి శరీరంలో పేరుకు పోతాయి అని నిపునులు అంటున్నారు. అందువలన షుగర్ ఉన్నటువంటి వారు మిల్క్ టీ ని తాగడం మంచిది కాదు. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఉదయం లేవగానే మిల్క్ టీ తీసుకోవటం వలన శరీరంలో టాక్సీన్స్ స్థాయిలు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగటానికి బదులుగా కొంచెం ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగితే మంచిది…