Health Problems : రాత్రిపూట బిర్యానీ అస్సలు మంచిది కాదు.. వినకుండా తింటే ప్రమాదంలో పడ్డట్లే!
Health Problems : చాలా మంది బిర్యానీ తినడానికి ఇష్ట పడతారు. ఎన్ని సార్లు బిర్యానీ తిన్నా… మళ్లీ మళ్లీ కావాలంటారూ. అందులోనూ.. మధ్యాహ్నం సమయంలో తినడం కంటే కూడా సాయంత్రం సమయంలో లేదా రాత్రి వేళ బిర్యానీ తినడానికి మొగ్గు చూపుతారు. లంచ్ కన్నా డిన్నర్‌కే ఎక్కువగా బిర్యానీని ప్రిఫర్ చేస్తారు. అయితే ఇలాంటి వారి కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇలా రాత్రి పడుకోబోయే ముందు బిర్యానీ తినడం వల్ల శరీరానికి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బిర్యానీ మేం చాలా ఎక్కువగా తింటాం అయినా మాకేం కాలేదని చాలా మంది భావిస్తుంటారు. అయితే రాత్రి పూట బిర్యానీ తినడం వల్ల అప్పటికప్పుడు ఎలాంటి ప్రభావం చూపట్టక పోవచ్చు.
కానీ.. దీర్ఘ కాలంలో ఈ అలవాటు వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు కొన్ని సార్లు సీరియస్ కూడా అవ్వొచ్చని చెబుతున్నారు.బిర్యానీ అంటే ముఖ్యంగా మసాలాలే. రైస్ ఏది అయినా.. అది మటన్, చికెన్, ఫిష్ లేదా ఇంకేది అయినా… బిర్యానీ అంటే మసాలాలే. చాలా మంది ఈ మసాలాల టేస్టు కోసం పడి చస్తారు. ఈ టేస్టుకు దాసోహం అంటారు. బిర్యానీ టేస్ట్ కావడానికి ఎన్నో మసాలాలను ఉపయోగిస్తారు. ఇందులో నూనె వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇన్నింటితో మిక్స్ అయి ఉన్న బిర్యానీని ఇష్టంగా లాగిస్తే మాత్రం జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది పేగుల ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. బిర్యానీ తింటే కొందరికీ అజీర్థి సమస్య కూడా వస్తుంటుంది.
బిర్యానీ రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒక సారి తినడం అస్సలు మంచి పద్ధతి కానే కాదు. బిర్యానీ లాంటి ఎక్కువ మసాలాలు ఉండే ఆహారాన్ని వారానికి ఒకసారి తీసుకుంటే శరీరం దానిని తట్టుకోగలదు. దానిని పూర్తిగా జీర్ణం చేసుకోగలదు. మసాలాలతో పాటు అర్టిఫీషియల్ కలర్స్ వాడకం బిర్యానీలో ఉంటుంది. బిర్యానీ చూసేందుకు ఆకట్టుకునేలా ఉండాలని ఫుడ్ కలర్స్ వాడతారు. ఈ ఆర్టిఫిషియల్ కలర్లలో టర్ ట్రాజెన్ ఒకటి. ఇది నీళ్లలో చాలా తొందరగా కరుగుతుంది. బిర్యానీ అంతా రెడీ అయ్యాక ఈ రంగును జల్లుతారు. ఈ రంగు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రమాదకరమైన రోగాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్, ఆస్తమా, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.