Health Benefits : బెల్లం నీటితో అనేక ప్రయోజనాలు.. ఉదయాన్నే తీసుకుంటే ఈ సమస్యలన్నీ దూరం…
Health Benefits : బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. అందుకే చక్కెరకు బదులు బెల్లాన్ని విరివిగా వినియోగిస్తారు. బెల్లాన్ని చక్కెరకు బదులు వాడొచ్చని… దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని రోజూ తింటే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయని.. బెల్లం తరచూ తింటే జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుందని చెబుతారు వైద్యులు. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఎక్కువగా వాడుతారు. ఔషధాలు, కషాయం వాడే సమయంలో బెల్లం తీసుకోవాలని సూచిస్తారు ఆయుర్వేద వైద్యులు. బెల్లానికి ఉన్న ప్రాముఖ్యత అది మరి.ఇక ఉదయం వేళ గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసుకుని ఖాళీ కడుపుతో తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
మిటమిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఎనర్జీ, చక్కెర, కార్పొహైడ్రెట్, సోడియం వట్టి అనేక రకాల పోషకాలు బెల్లంలో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఏదో ఒక విధంగా మన శరీరానికి మేలు చేస్తాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ శరీరంలోని రక్త హీనతను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచేందుకు బెల్లం ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో పాటు బెల్లం తీసుకుంటే జీవ క్రియ మెరుగు పడుతుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు బెల్లం నీరు వాడితే ఉప శమనం కలుగుతుంది. గ్యాస్ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి.
బెల్లం తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య కూడా పరిష్కారం అవుతుంది.ఊబకాయంతో బాధపడుతున్న వారు బెల్లం నీటిని తాగితే క్రమంగా బరువు తగ్గుతారు. బెల్లం నీటితో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా దరిచేరవు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నీటిలో బెల్లం కలుపుకుని తాగితే శరీరంలోని మలినాలు అన్ని తొలగిపోతాయి. బెల్లంలోని విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది. శరీరాన్ని శాంత పరుస్తుంది.