Diabetes : ప్రతిరోజు ఈ టీ తాగి షుగర్ కి చెక్ పెట్టండి ఇలా…!
ప్రధానాంశాలు:
ఈ టీ తాగి షుగర్ కి చెక్
ప్రతిరోజు ఈ టీ ని తాగి షుగర్ కి చెక్ పెట్టండి ఇలా..
Diabetes : ప్రస్తుతం వయసు తరహా లేకుండా చాలామంది మధుమేహం బారినపడి ఎంతో ఇబ్బంది పడుతున్నారు.. దీనికోసం నిత్యం ఎన్నో మందులను వాడుతున్నారు.. అయినా షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు.. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వాడితోనే ప్రతిరోజు ఈ టీ ని తాగి షుగర్ కి చెక్ పెట్టండి ఇలా.. ఆ టీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దాల్చిన చెక్కను పక్కన పెట్టేస్తున్నారా.. దాని కేవలం సాధారణ వంటలకే పరిమితం చేయకుండా ఇదిగో ఇలా కలుపుకొని తాగేయండి. సువాసనతో పాటు మంచి రుచులు కూడా అందించే చెక్కను చాలామంది పచ్చిగా కూడా తినేస్తుంటారు. తియ్యగా ఘాటుగా ఉండే దీన్ని వంటల్లో వాడతారు అనే సంగతి తెలిసిందే.. ముఖ్యంగా బిర్యానీలో అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే.. అయితే దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. మరి అవి ఏంటో చూద్దామా.. రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆహారా నిపుణులు తెలిపారు.
దాల్చిన చెక్కలో శరీరానికి కావలసిన పీచు, క్యాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. అందుకే చాలా దేశాల్లో దీన్ని మిరాకిల్ ఫుడ్ అని అంటారు. దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూద్దాం.. టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఒంట్లో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాల్చిన చెక్క ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఏమైనా సమస్య ఉంటే దాల్చిన చెక్క తొలగిస్తుంది. దాల్చిన చెక్క రక్తం గడ్డ కట్టడాన్ని అరికడుతుంది. శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగడానికి దాల్చిన చెక్క తోడ్పడుతుంది. దాల్చిన చెక్క గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా సరిపడే శక్తిని ఇస్తుంది. దాల్చిన చెక్క పొడి ఉదయాన్నే తాగే కాఫీ లేదా టీలో కలుపుకొని తాగాలి.
ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగొచ్చు. దాల్చిన చెక్క పొడిని అన్ని వయసుల వారు తినొచ్చు.. అయితే చర్మం మంటగా ఉన్న అలర్జీలు ఏర్పడిన ఈ దాల్చిన చెక్కను తీసుకోవడం మానేయండి. గర్భిణీలు ఆరేళ్లలోపు పిల్లలు దాల్చిన చెక్కను ఆహారంతో తీసుకోకపోవడం మంచిది. గ్యాస్ సమస్యలు కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు దాల్చిన చెక్కను తీసుకోవద్దు… వీటిలో ఉన్న మసాలా తత్వం ఇంకాస్త ఈ సమస్యలను ఎక్కువ ఎలా చేస్తుంది. కాబట్టి ఈ దాల్చిన చెక్కని టీ ని అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.