Beauty Tips : ఈ జ్యూస్ లు తాగితే మీ చర్మం కాంతివంతంగా మారడం ఖాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఈ జ్యూస్ లు తాగితే మీ చర్మం కాంతివంతంగా మారడం ఖాయం…!!

 Authored By aruna | The Telugu News | Updated on :12 September 2023,8:00 am

Beauty Tips : సహజంగా అందరూ ఆడవారు అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరి చర్మం సుతి మెత్తగా, నున్నగా బేబీ స్కిన్ లాస్ మెరిసిపోతూ ఉంటుంది. మరికొందరు ముఖంలో తేజస్ లేకుండా కనిపిస్తూ ఉంటారు. ఎన్నో రకాల చిట్కాలను పాటించిన కూడా ఫలితం ఉండదు… మేకప్ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. పండ్లతో తయారు చేసే ఇటువంటి జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. స్కిన్ గ్లో రావడం కోసం ఎలాంటి జ్యూసులు తాగాలో ఇప్పుడు మనం చూద్దాం…

పుచ్చకాయ జ్యూస్; 90 శాతం నీరు ఉండే పుచ్చకాయ దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరింత తేటగా మారుతుంది.

నిమ్మకాయ జ్యూస్ : నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్య ఔషధం. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థ్యం కలిగిన గుణాలు కలిగి ఉన్నది చర్మాన్ని శుభ్రపరచి ఫ్రెష్ గా ఉంచుతుంది.

Drinking these juices will surely make your skin glow

Drinking these juices will surely make your skin glow

ఆపిల్ జ్యూస్ : ఆపిల్ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ప్రతిరోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబంధ వ్యాధుల్ని తగ్గిస్తుంది. అలాగే ఆపిల్ జ్యూస్లో కూడా ఇదే గుణాలు ఉంటాయి. కావున మృదుత్వాన్ని ఇచ్చి చర్మం మెరిసేలా చేస్తుంది.

టమాటా జ్యూస్ ; టమాటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ లు అధికంగా ఉంటాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్లా చేసుకుని దాంట్లో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి తీసుకుంటే చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

బొప్పాయి జ్యూస్ ; బొప్పాయి జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోజు ఒక అరకప్పు బొప్పాయి ముక్కలు తింటే చాలా మంచిది నిర్జీవమైన చర్మాన్ని కాంతవంతంగా మారుస్తుంది బొప్పాయి జ్యూస్ లో అరచి తేనె కలిపి ముఖానికి పట్టించాలి 20 నిమిషాల తర్వాత కడిగినట్లయితే చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది