Eggs : కోడుగుడ్డు తినేటప్పుడు ఈ 2 తప్పులు చేయకండి… భయంకరమైన వ్యాధుల బారిన పడతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eggs : కోడుగుడ్డు తినేటప్పుడు ఈ 2 తప్పులు చేయకండి… భయంకరమైన వ్యాధుల బారిన పడతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 June 2023,8:00 am

Eggs : ఈరోజు మేము గుడ్డు తినడం వల్ల కలిగే లాభాల గురించి మీకు చెప్పబోతున్నాం..గుడ్డును అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా.. మరి మీకు తెలుసా ఈ గుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ ఉన్నాయి. ఎలాంటి వారైనా సరే గుడ్డు తప్పకుండా తినాలి. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా గుడ్డు తినొచ్చు. మరి ఈ గుడ్డులో అసలు పోషకాలు ఏమున్నాయి. గుడ్డుని ఎలా తింటే ఎప్పుడు తింటే మంచిది అనే వాటి గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను.. గుడ్డులో ఐదు గ్రాములు ఫ్యాట్స్ ఉంటాయి. పాలతో పాటు గుడ్డుని కూడా రోజు తీసుకుంటే మన ఒంటికి చాలా మంచిదని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ గుడ్డును తినాలి అని కూడా చెప్తారు. గుడ్డు మన ఒంటికి బలం ఇస్తుంది.

గుడ్డులో విటమిన్ సి తప్ప మిగతా విటమిన్స్ అన్ని ఉన్నాయి. ఎవరైతే ఉదయం పూట రోజు గుడ్డు తింటారో వారిలో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ.. గుడ్డు తింటే ఎంత మంచిదో మనం చూశాం కదా మరి నాటు కోడిగుడ్డు మంచిదా లేక ఫారం కోడి గుడ్డు మంచిదా అనే వాటి మీద ఈరోజుకి కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ గుడ్డు తీసుకున్న కూడా మన ఒంటికి మంచిదే కానీ.. ఫారం కోడి గుడ్డుతో పోలిస్తే నాటు కోడి గుడ్డులో పోషకాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.

eating chicken eggs and you will get terrible diseases

eating chicken eggs and you will get terrible diseases

ఎందుకంటే ఫారం కోళ్లను ఇంజక్షన్లు మందులు ఇచ్చి పెంచుతారు కానీ నాటు కోళ్లు ఏది పడితే అది తింటూ బయట తిరుగుతూ తిరుగుతాయి అలా చూసినట్లయితే నాటు కోడి గుడ్డులోనే ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. ఇది కణాలు వృద్ధి చెందించి అలాగే మెదడు పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇవి వాటిలోని చేదు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మీకు తెలుసా గుడ్డు తింటే బరువు పెరగరు కాబట్టి తీసుకుంటే అన్ని రకాల పోషక విలువలు మనకు అందుతాయి. మరి గుడ్డు రోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈరోజుల్లో చాలామంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన చిన్న వయసు నుంచే రోగాల బారిన పడుతున్నారు. మీరు చూసే ఉంటారు.

చిన్న వయసు వారికి కూడా షుగర్లు బీపీలు గుండె జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం రోజు గుడ్డు తిన్నట్టు అయితే ఇలాంటి వాటిని మనం అరికట్టవచ్చు. అంతేకాదు మన పిల్లలకు కూడా చిన్నప్పటినుండి గుడ్డుని అలవాటు చేస్తే వారిలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది