Dry Apricots : ఈ పండ్లను రోజు తినకపోయినా అప్పుడప్పుడు తిన్న చాలు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…
Dry Apricots : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో ఆప్రికాట్ పండు కూడా ఒకటి. అయితే ఆప్రికాట్ పండును తినలేని వారు డ్రై ఆప్రికాట్ ను తీసుకోవచ్చు. అయితే ఈ డ్రై ఆప్రికాట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి యొక్క రుచి పుల్లగా మరియు తియ్యగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వలన ఎన్నో రకాల […]
ప్రధానాంశాలు:
Dry Apricots : ఈ పండ్లను రోజు తినకపోయినా అప్పుడప్పుడు తిన్న చాలు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...
Dry Apricots : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో ఆప్రికాట్ పండు కూడా ఒకటి. అయితే ఆప్రికాట్ పండును తినలేని వారు డ్రై ఆప్రికాట్ ను తీసుకోవచ్చు. అయితే ఈ డ్రై ఆప్రికాట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి యొక్క రుచి పుల్లగా మరియు తియ్యగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అంతేకాక వీటిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
వీటితో అజీర్తి సమస్యలను ఈజీగా తొలగించవచ్చు. ఈ డ్రై ఆప్రికాట్ ను తీసుకోవటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి మనకు దొరుకుతుంది. అలాగే వీటిని తినటం వలన వెంటనే నీరసం మరియు అలసట అనేవి తొలగిపోయి ఎంతో ఎనర్జీ లభిస్తుంది. వీటిలో కేలరీలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. అలాగే జీర్ణ సమస్యలను తగ్గించటంలో కూడా ఈ అప్రికాట్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే అజీర్తి మరియు కడుపు ఉబ్బరం, కడుపులో మంటను కూడా నయం చేస్తాయి.
అలాగే వీటిని పిల్లలకు ఇవ్వడం వలన మజిల్ ఫంక్షన్ అనేది ఎంతో బాగా డెవలప్ అవుతుంది. ఇకపోతే మీకు ఫాస్ట్ ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు ఈ డ్రై ఫ్రూట్ ను తీసుకోవడం వలన క్రెవింగ్స్ అనేవి దూరం అవుతాయి. అలాగే వీటిని పెరుగు మరియు సలాడ్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. అంతేకాక వీటిని స్మూతీస్ మరియు జ్యూస్ లు లాంటి వాటిని చేసేటప్పుడు పంచదారకి బదులుగా వీటిని గ్రైండ్ చేసి ఉపయోగించవచ్చు. అలాగే వీటిని గర్భిణీలు కూడా డేట్ లో యాడ్ చేసుకుంటే పుట్టే బిడ్డ కి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి