Brain Health : బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే… మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brain Health : బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే… మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!!

Brain Health : ప్రస్తుత కాలంలో మారినటువంటి ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కారణం చేత మెదడుపై కూడా చెడు ప్రభావం పడుతుంది. అలాగే మెదడు అనేది సరిగ్గా పనిచేస్తేనే మన శరీరంలో అన్ని భాగాలు కూడా సరిగా పని చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో పిల్లలకు మరియు పెద్దలకు జ్ఞాపకశక్తి అనేది బాగా మందగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు జ్ఞాపకశక్తి అనేది చాలా అవసరం. అలాగే పిల్లలు చురుగ్గా ఉండాలన్నా మరియు చదివింది గుర్తు ఉండాలన్న మెదడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Brain Health : బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే... మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే...!!

Brain Health : ప్రస్తుత కాలంలో మారినటువంటి ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కారణం చేత మెదడుపై కూడా చెడు ప్రభావం పడుతుంది. అలాగే మెదడు అనేది సరిగ్గా పనిచేస్తేనే మన శరీరంలో అన్ని భాగాలు కూడా సరిగా పని చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో పిల్లలకు మరియు పెద్దలకు జ్ఞాపకశక్తి అనేది బాగా మందగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు జ్ఞాపకశక్తి అనేది చాలా అవసరం. అలాగే పిల్లలు చురుగ్గా ఉండాలన్నా మరియు చదివింది గుర్తు ఉండాలన్న మెదడు అనేది ఎంతో ఆరోగ్యంగా పని చేయాలి. అలాగే మెదడు సరిగ్గా పని చేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం తప్పనిసరి. అయితే చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోరు. దీంతో మెదడు అనేది మొద్దు బారిపోతుంది. అలాగే అల్జిమర్స్ అనే వ్యాధి కూడా వస్తుంది. అలాగే మన మెదడు అనేది సరిగ్గా పని చేయాలి అంటే విటమిన్ ఇ మరియు జింక్,ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ పోషకాలు అనేవి మనకు సరిగ్గా అందితేనే మెదడు కూడా సరిగ్గా పని చేస్తుంది. మరి మెదడు అనేది సరిగ్గా పని చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Brain Health జింక్

జింక్ అనేది కేవలం మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీరం బలంగా మరియు దృఢంగా ఉండాలన్నా జింక్ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ జింక్ అనేది అధికంగా జనపనార విత్తనాలు మరియు పొద్దుతిరుగుడు గింజలు మరియు నల్ల నువ్వులు,తెల్ల నువ్వులలో కూడా ఉంటాయి. వీటిని ఇతర ఆహారాలతో కలిపి తీసుకున్న లేక నానబెట్టి తీసుకున్న జింక్ చక్కగా అందుతుంది. అలాగే జింక్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే మెదడు యొక్క కణాల పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది…

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ : మెదడు నరాలు చక్కగా పని చేయాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవటం కంపల్సరీ. అయితే ఈ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వలన తొందరగా అల్జీమర్స్ అనే వ్యాధి ఎటాక్ కాకుండా ఉంటుంది. అలాగే చియా సీడ్స్ మరియు అవిసె గింజలు, వాల్ నట్స్ లాంటి వాటిలలో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి…

Brain Health బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే

Brain Health : బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే… మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!!

విటమిన్ ఇ : మెదడు సరిగ్గా పని చేసేందుకు విటమిన్ ఇ కూడా చాలా అవసరం. ఇది మెదడులో ఉన్న కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. అయితే విటమిన్ ఇ అనేది ఎక్కువగా పోద్దుతిరుగుడు పప్పు మరియు బాదంపప్పు, పలు రకాల కూరగాయలలో ఎక్కువగా దొరుకుతుంది. కావున ఈ మూడు ఉన్నటువంటి ఆహారాలను సరైన పరిమాణంలో తీసుకుంటే బ్రెయిన్ ఎంతో స్పీడ్ గా పని చేస్తుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది