Eggs: గుడ్లను ఎక్కువగా తింటున్నారా… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eggs:  గుడ్లను ఎక్కువగా తింటున్నారా… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా….

Eggs :  మన ఆరోగ్యం కోసం రోజు వారి ఆహారంలో గుడ్లను తీసుకుంటూ ఉంటాము. అయితే రోజు గుడ్లు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కావున ఎంతోమంది గుడ్లను తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ గుడ్లు రోజు తినడం వలన హాని జరుగుతుందా అని ఆందోళన పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరైతే ప్రతినిత్యం అధికంగా గుడ్లని తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవటం వలన ఎలాంటి హాని […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Eggs :  గుడ్లను ఎక్కువగా తింటున్నారా... ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా....

Eggs :  మన ఆరోగ్యం కోసం రోజు వారి ఆహారంలో గుడ్లను తీసుకుంటూ ఉంటాము. అయితే రోజు గుడ్లు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కావున ఎంతోమంది గుడ్లను తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ గుడ్లు రోజు తినడం వలన హాని జరుగుతుందా అని ఆందోళన పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరైతే ప్రతినిత్యం అధికంగా గుడ్లని తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవటం వలన ఎలాంటి హాని జరుగుతుందో తెలుసా. గుడ్లను అధికంగా తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.గుడ్లను అధికంగా తీసుకోవటం వలన జీర్ణాశయంలో సమస్యలు అనేవి మొదలవుతాయి. అంతేకాక అధికంగా గుడ్లను తీసుకోవడం వలన కిడ్నీల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ గుడ్లను అధికంగా తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ అనేది ఎంతగానో దెబ్బతింటుంది. దీన్ని గనక మీరు పట్టించుకోకుండా అలా వదిలేస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

అయితే ఈ గుడ్లలో విటమిన్ ఏ,బి12, డి, ఇ,ఓమెగా -3 లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే రోజుకు రెండు గుడ్లు తింటే చాలు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ గుడ్లలో విటమిన్ లు,ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అందువలన గుడ్లను పోషకల నిధి అని కూడా అంటారు. అయితే ఎవరైనా సరే రోజుకు ఒకటి లేక రెండు గుడ్లు మాత్రమే తీసుకోవడం మంచిది. అయితే ఈ గుడ్లను తినేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. అంతేకాక ఈ గుడ్లలో ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం,ఫొలేట్, థయామిన్ లాంటి పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఏ వయసు వారైనా ఆరోగ్యవంతమైన వ్యక్తులు ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకుంటే చాలు. కానీ ఒకటి కంటే ఎక్కువ గుడ్లను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ గుడ్లను ఆమ్లెట్ వేసుకొని తీసుకోవటం కన్నా ఉడకబెట్టుకొని తీసుకోవటం మంచిది అని అంటున్నారు…

Eggs గుడ్లను ఎక్కువగా తింటున్నారా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా

Eggs :  గుడ్లను ఎక్కువగా తింటున్నారా… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా….

అయితే వారం మొత్తంలో కూడా ఐదు లేక ఆరు గుడ్ల కంటే ఎక్కువ తినటం మంచిది కాదు. ఇలా తీసుకోవటం వలన గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రతిరోజు రెండు లేక మూడు గుడ్లు తీసుకునేవారు గుడ్డు లోపల పచ్చసొనను తీసివేసి తినడం మంచిది. ఈ గుడ్డులో ఉన్నటువంటి పచ్చసొన అధికంగా తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అలాగే గుండెకు సంబంధించిన ప్రమాదాలను కూడా పెంచుతుంది. ప్రస్తుతం మీరు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే గుడ్డును తీసుకునే ముందు వైద్యులను సంప్రదించటం ఎంతో అవసరం. గుడ్ల వలన ఎనర్జీ వస్తుంది కదా అని బలవంతంగా కూడా గుడ్లను తీసుకోకూడదు. లేకుంటే శారీరక సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు వ్యాయామం చేసేవారు ఒకటి కంటే ఎక్కువ గుడ్లను కూడా తినవచ్చు. అయితే ఎవరైనా సరే గుడ్డు లోపల ఉన్నటువంటి పచ్చసొన ను తీసుకోకుండా ఉండటమే మంచిది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది