Tomato : టొమాటో అధికంగా తింటే కిడ్నీలకు ప్రమాదం తప్పదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tomato : టొమాటో అధికంగా తింటే కిడ్నీలకు ప్రమాదం తప్పదా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,6:00 am

tomato : మనం ఇంట్లో వండుకునే ప్రధానమైన కూరగాయాల్లో టొమాటకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది లేకుంటే కొందరికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. కర్రీలు, ఫ్రైలు, నాన్ వెజ్ ఐటమ్స్‌లో కూడా టొమాటో లేదా దాని గుజ్జును అధికంగా వినియోగిస్తుంటారు. ఇక బయట రెస్టారెంట్లు, బేకరీల్లో టొమాటో సాస్ తప్పనిసరి అయిపోయింది. కర్రీల్లో గ్రేవీ , టెస్ట్ కోసం టొమాటోను కొందరు అధికంగా వినియోగిస్తుంటారు. టొమాట చూసేందుకు ఎరుపుగా కళ్ల నిండా ఆకర్షిస్తుంది. శరీర డైట్ మెయింటెన్ చేసేవారు పచ్చి టమాటాలను కూడా తింటుంటారు. ఆరోగ్యానికి టొమాటో చాలా మంచిది. అయితే, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు టొమాటో ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Tomato : కిడ్నీల్లో రాళ్ల పెరుగుదలకు కారకం..?

సాధారణంగా మనం ఇంట్లో టొమాటోను అధికంగా వినియోగిస్తుంటాము. కూరలు, సూప్స్ కోసం విరివిగా వాడుతుంటాము. అయితే టొమాటోను ఎక్కువగా తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ల సంఖ్య పెరుగుతుందని, లేనివారికి కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టొమాటోను ఆగ్జాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్స్, కాల్షియంతో పాటు ఆగ్జాలిన్ అనేది మన బాడీలోని యూరిక్ యాసిడ్‌తో కలిసినప్పుడు చెడు జరిగే అవకాశం ఉంది. ఆగ్జాలిన్‌ను యూరిక్ యాసిడ్ శోషించుకోవడం వలన కిడ్నీల్లో చిన్నగా రాళ్లలాగా ఏర్పడుతాయి. క్రమంగా ఇవి పెద్దగా అవ్వడం ద్వారా మూత్రానికి అడ్డుగా ఉంటాయి.

eating too much tomato should not endanger the kidneys

eating too much tomato should not endanger the kidneys

దీంతో మూత్రం పోసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పికలుగుతాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో నీటి స్థాయి పెరిగి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. కొంతకాలానికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టొమాటోను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టొమాటను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడానికి లేదా వాటి ఎదుగుదలకు ఆగ్జాలిన్ అనేది చాలా ప్రోత్సహిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది