ఇలా చేశారంటే కచ్చితంగా నెల నెలా నెలసరి వస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఇలా చేశారంటే కచ్చితంగా నెల నెలా నెలసరి వస్తుంది..!

ఈ మధ్య కాలలంలో చాలా మంది మహిళల్లో రుతు క్రమం క్రమ పద్ధతిలో రావడం లేదనే సమస్య వస్తోంది. రుతు క్రమం సక్రమంగా రాకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అతి ముఖ్యంగా పిల్లలు కావాలనుకునే మహిళలు ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరైన సమయంలో రాని పిరియడ్స్ వలన చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యకాలంలో స్త్రీలలో పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు అధికమై అదపు తప్పిన రుతు […]

 Authored By pavan | The Telugu News | Updated on :27 April 2022,7:00 am

ఈ మధ్య కాలలంలో చాలా మంది మహిళల్లో రుతు క్రమం క్రమ పద్ధతిలో రావడం లేదనే సమస్య వస్తోంది. రుతు క్రమం సక్రమంగా రాకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అతి ముఖ్యంగా పిల్లలు కావాలనుకునే మహిళలు ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరైన సమయంలో రాని పిరియడ్స్ వలన చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యకాలంలో స్త్రీలలో పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు అధికమై అదపు తప్పిన రుతు క్రమం అనే మాట ప్రతి ఒక్కరి లోనూ ఎక్కువగా వినిపిస్తుంది. సమయానికి రాని రుతు క్రమంపై నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

దీన్ని తగ్గించుకోవడానికి మందులు వాడితే వాటి సైడ్ ఎఫెక్ట్స్ మరింత బాధ పెడుతుంటాయి. కానీ సరైన రుతు క్రమం సమయానుకూలంగా రావాలంటే ఇంట్లో చేసుకునే ఒక మంచి చిట్కా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. పీరియడ్స్ సరిగ్గా రావాలి అంటే మంచి వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. అందుకే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా వ్యాయామాన్ని మీ రోజు వారీ దిన చర్యలో భాగం చేసుకోండి. అలాగే మైదా, పంచదార వంటి పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. వాటితో పాటు ఇప్పుడు చెప్ప బోయే ఈ చిన్న చిట్కా గురించి కూడా తెలుసుకొని దానిని వాడడం వలన రుతు క్రమం సరైన పద్ధతిలో ఉంటుంది.ఒక గ్లాసు వేడి నీటిని తీసుకోవాలి.

effective home remedies for irregular periods

effective home remedies for irregular periods

దానిలో జీలకర్ర దంచి చేసుకున్న పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. దానిలో పసుపు పావు స్పూన్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని అరచెక్క నిమ్మరసం ఇందులో పిండుకోవాలి. ఒక స్పూన్ వరకు టమాటా రసాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ బాగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పడుకునే ముందు తాగాలి. రెండు, మూడు నెలల నుంచి పీరియడ్స్ రావట్లేదు అనుకున్నవారు ఉదయం, సాయంత్రం కూడా తాగాలి. అలాగే ఈ నీటిని తాగిన తరువాత ఒక నిమ్మకాయ సైజు బెల్లం ముక్క తినడం వలన పీరియడ్స్ సమస్యను అధిగమించవచ్చు. ఈ డ్రింక్ శరీరంలో కొవ్వు కరిగించి అధిక బరువు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీర వ్యవస్థ పనితీరును గాడిలో పెట్టి పిసీఓడీ లాంటి అనేక అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బెల్లం రక్తహీనత, ఐరన్ లోపం సమస్యలు ఉంటే తగ్గించడంలో దోహదపడుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది