Eyesight : మీ కంటి చూపు తగ్గిపోతుందా… మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లోపం ఉందేమో తెలుసుకోండి ఇలా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eyesight : మీ కంటి చూపు తగ్గిపోతుందా… మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లోపం ఉందేమో తెలుసుకోండి ఇలా…

 Authored By aruna | The Telugu News | Updated on :16 September 2022,6:30 am

Eyesight : శరీరంలో కళ్ళు అనేవి ప్రధానమైనవి. కళ్ళు లేకపోతే మనకి అంత చీకటిమయం అయిపోతుంది. కాబట్టి కళ్ళు అనేవి దేవుడిచ్చిన అపురూపమైన వరం. ఈ కళ్ళను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం మనకి చాలా ముఖ్యం. అయితే ఎంతోమంది ఆడవారు కళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చిన అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ సమస్యకి ముఖ్య కారణం విటమిన్ ఏ లోపం అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అసలు ఆ విటమిన్లు అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

విటమిన్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. వ్యాధులతో పోరాడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ విటమిన్లు, ఖనిజాలు చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాల లోపాలు ఉండడం వలన ఇలా చూపు తగ్గిపోతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులను రాత్రి పూట చూడడంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్య యువకులకు, మధ్య వయసు గల వారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే మన శరీరంలోని కొన్ని రకాల లోపాల గురించి చెప్పే సాంకేతాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

Eyesight vitamin A is deficient in the food you eat

Eyesight vitamin A is deficient in the food you eat

1) విటమిన్” సి” : విటమిన్ సి కూడా కంటి చూపును మెరుగుపరచడానికి అద్భుతమైన పోషకంగా వెలువడింది. ఇది కంటి సైటును తగ్గిస్తుంది. అసిస్టమైన దృష్టి ఇబ్బందిని నివారిస్తుంది. అయితే మీరు ఉసిరి, మోసంబి, జామ, బ్రోకలీ, నల్లమిరియాలు, నారింజ, నిమ్మ లాంటివి తీసుకుంటే ఈ విటమిన్ సి పోషకం లోపం తగ్గిపోతుంది. 2) విటమిన్ “ఇ” : విటమిన్ ఈ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రమాదం నుండి మనల్ని కాపాడుతుంది. దీన్ని పొందడానికి ఎక్కువగా సల్మాను చేపలు, నట్స్, అవకాడో, ఆకుకూరలు తీసుకోవాలి.

3) విటమిన్” బి” : మీ కంటి చూపు ఎప్పుడూ బలంగా ఉండాలంటే విటమిన్ b6, విటమిన్ బి 12, విటమిన్ బి 9 లోపం లేని ఆహారాన్ని తీసుకోవాలి. దీనికోసం పాలు, గింజలు, మాంసం, బీన్స్, డ్రై ఫ్రూట్స్, పప్పులు తినాలి. 4) విటమిన్” ఏ” : సంపూర్ణ దృష్టి నీ పొందాలంటే నిత్యం విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మన శరీరంలో అతి ప్రధానమైనది ఇదే. ఎందుకనగా చీకట్లో చూడడానికి సహాయపడే ప్రోడపిడిక్స్ ను ఉత్పత్తి చేయడానికి విటమిన్ ఏ బాగా సహాయపడుతుంది. కావున విటమిన్ ఏ లోపం రాత్రి ఆంత్వత్వానికి దారితీస్తుంది. ఈ విటమిన్ లోపంతో కంటి బయటి కొరకు రక్షణ తొలగిపోతుంది. ఇటమిన్ ఏ లోపంతో రాత్రి టైం లో ఏది సరిగా కనిపించదు. దీనికోసం గుమ్మడికాయ, బొప్పాయి, క్యారెట్, బత్తాయి, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది