Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా.. కొవ్వు కరగడానికి ఇవి తింటే చాలు..!
ప్రధానాంశాలు:
Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా.. కొవ్వు కరగడానికి ఇవి తింటే చాలు..!
Fatty Liver : ఇటీవలి కాలంలో చాలా మంది బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మనం తినే ఆహారంతో అన్ని రకాల పోషకాలు అందుతాయి. కొవ్వు కూడా అలానే. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచి చేసే మంచి కొవ్వు ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. మంచి కొవ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, చెడు కొవ్వుతో చాలా సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి మన బాడీలోని ముఖ్య అవయవాలని సక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. ఫ్యాటీ లివర్ నిర్ధారణ అయిన తర్వాత, మొదట చేయవలసినది ఆహారాన్ని మార్చడం. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నింటిని మార్చి.. మంచి ఆహారాన్ని తీసుకోవాలి..
Fatty Liver : ఇవి పాటిస్తే మంచింది..
ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం మద్యం సేవించడం వల్ల వస్తుంది.. ఒక వ్యక్తి కాలేయం నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ తాగడం కొనసాగిస్తే, ఏఎల్‌డీ పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. లక్షణాలు సాధారణంగా కనిపించనప్పటికీ, ఉదరం యొక్క కుడి ఎగువ భాగంలో నొప్పి లేదా అసౌకర్యం. జ్వరం, వికారం, వాంతులు, కడుపు నొప్పి మరియు కామెర్లు (పసుపు కళ్ళు మరియు చర్మం) కలిగించే కాలేయ విస్తరణ. కాలేయ సిర్రోసిస్ అనేది మచ్చ కణజాలం యొక్క హెపాటిక్ చేరడం. ఆల్కహాలిక్ హెపటైటిస్ వంటి అదే లక్షణాలతో పాటు, ఇది మీ పొత్తికడుపులో పెద్ద ఎత్తున ద్రవం చేరడం, అధిక హెపాటిక్ రక్తపోటు, అంతర్గత రక్తస్రావం, ప్రవర్తనా మార్పులు, విస్తరించిన ప్లీహము మరియు మరెన్నో కూడా కారణమవుతుంది.
ఫ్యాటీ లివర్ సమస్య నుండి తప్పించుకోవాలి అంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. రాత్రి పూట గొధుమ లేదా తృణధాన్యాల రొట్టెతో పాటు బ్రౌన్ రైస్, డాలియా, ఓట్స్ మొదలైనవి తినవచ్చు. రాత్రి పప్పు అన్నా తిని పడుకోవాలి. భోజనం చేయకుండా పడుకోవద్దు. చేపలు, చికెన్ రెండింటినీ తినవచ్చు. ఉదయం తినకపోతే సాయంత్రం భోజనంలో చేపలు లేదా చికెన్ తినవచ్చు. రాత్రిపూట అయితే గుడ్డు లోని సొన (పసుపు) భాగం తినకుండా ఉంటే మంచిది. కూరగాయలలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ఎల్లప్పుడూ రాత్రివేళ వెజిటబుల్ కర్రీని తినవచ్చు.