Fenugreek : చలికాలంలో మెంతికూర తింటే బోలెడు ప్రయోజనాలు… తెలిస్తే అసలు వదలరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fenugreek : చలికాలంలో మెంతికూర తింటే బోలెడు ప్రయోజనాలు… తెలిస్తే అసలు వదలరు…!

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,5:00 pm

Fenugreek : ఆకుకూరల వల్ల మనకు సమకూరరే అనేక ప్రయోజనాల గురించి అనేక సందర్భాలలో తెలుసుకున్నాం.. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందియడంలో ఈ మెంతుకూర ముందు ఉంటుంది. ఈ ఏ ఆకుకూర చేయని మేలు ఈ ఆకుకూర చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని ద్వారా శరీరంలోని రక్తహీనతలును దూరం చేస్తుంది. ఇంకా శరీరంలోని వ్యాధినిరోధకత శక్తిని పెంచుతుంది. చలికాలంలో మెంతికూర తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మెంతి ఆకులు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

శీతాకాలంలో మెంతు ఆకులను కూరగాయలు, పూరీలు, పప్పులు కలిపి తింటారు. ఇవి ఆహారం యొక్క రుచులు కూడా పెంచుతాయి. వీటివల్ల ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. చలికాలంలో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మెంతాకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువ ఆకలిగా అనిపించదు. ఈ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలం మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

దీని నియంత్రించాలంటే మెంతికూరను కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. ..దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.. చలికాలంలో చర్మం పగలడాన్ని కూడా ఇది నియంత్రిస్తుంది. అలాగే మెంతు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి ఆకులను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంపై ఉన్న మచ్చలను మొటిమలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది