Beauty Tips : ముఖం మీది నల్ల మచ్చలు పోయి.. కాంతి వంతంగా తయారు కావాలంటే ఈ ప్యాక్ వేసుకోవాల్సిందే!
ప్రతీ ఒక్కరికి అందరి ముందూ అందంగా కనిపించాలని ఉంటుంది. మహిళల్లో అయితే ఇది ఇంకాస్త ఎక్కువనే చెప్పొచ్చు. అయితే అందంగా కనిపించాలని అందరికీ అనిపించినా కొందరి ముఖంపై ఉండే మచ్చలు, మెటిమలు వల్ల వారి అందం తగ్గిపోతుంది. అయితే అలాంటి వారు చాలా బాధపడిపోతూ ఉంటారు. వాటిని తగ్గించుకునేందుకు బ్యూటీ పార్లర్లు.. స్కిన్ కేర్ సెంటర్లకు పరుగులు పెడ్తుంటారు. కానీ అవన్నీ ఏం అవసరం లేకుండా… మొహం మీద ఉండే ఓపెన్ పోర్స్, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, టాన్ ను తరిమికొట్టే అద్భుతమైన న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఒకటి ఉంది. అయితే ఈ ప్యాక్ వేసుకుంటే మచ్చలన్నీ తొలగిపోయి మీ మొహం కాంతివంతంగా తయారు అవుతుంది. అయితే ఆ ప్యాక్ ఏంటి, అది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు, కాఫీ పౌడర్, నిమ్మరసం కావాలి. మొదట ఒక బంగాళ దుంపని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బంగాళ దుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని… కొన్ని నీళ్లు కలిపి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకునేటప్పుడు మిశ్రమం గట్టి పడ్తుంటే కాసిన్ని నీళ్లు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆప్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మీ మొహానికి కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత ఫేస్ శుభ్రంగా కడిగి ఈ మిశ్రమాన్ని మొహంపై అప్లై చేసుకోవాలి. హదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ట్రై చేసిన వెంటనే మీకు తేడా తెలుస్తుంది. కాఫీ పొడి వద్దనుకున్న వాల్లు బియ్యం పిండి లేదా శనగ పిండి, గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. నిమ్మరసం బదులుగా పాలు, రోజ్ వాటర్ ను కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ ను ప్రతిరోజూ వేసుకోవడం వల్ల టామ్, నల్లని మచ్చలు తొలగిపోతాయి. మెటిమలు కూడా రాకుండా చేస్తుంది. ఒకవేళ అప్పటికే మొటిమలు ఉన్నట్లయితే చాలా వరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ మొహాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే మొహమంతా మృదువుగా, ముడతలు లేకుండా తయారవుతుంది.