Ginger Juice : పరిగడుపున అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ginger Juice : పరిగడుపున అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే…!

Ginger Juice : మనం నిత్యం వంటల్లో వేసే అల్లం ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోని రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం కలుపుకోని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. నిత్యం పరిగడుపున […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ginger Juice : పరిగడుపున అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే...!

Ginger Juice : మనం నిత్యం వంటల్లో వేసే అల్లం ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోని రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం కలుపుకోని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. నిత్యం పరిగడుపున అల్లం రసం తీసుకున్నట్లయితే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె సమస్యలు రావు.

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, పొటాషియం లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పులును తగ్గిస్తాయి. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. తిన్న అన్నం సులువుగా జీర్ణం అవుతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుంటే అందుకు అల్లం రసం పరిష్కారం చూపుతోంది. అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. శరీరానికి శక్తి బాగా అందుతుంది. యాక్టివ్గా ఉంటారు. ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అల్లం రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తోంది.

చాలామంది కాల్షియం తక్కువ ఉండి కండరాలు పట్టేస్తూ ఉంటాయి.అలాంటివారు అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే అల్లం లో ఉండే మినరల్స్ శరీరంలోని ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ను బాలన్స్ చేస్తాయి. దీంతో కండరాలు పట్టేయకుండా ఉంటాయి. అందులో పుష్కలంగా ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ వృద్ధాప్య ఛాయాలను కనిపించకుండా చేస్తాయి. చర్మం వెంట్రుకలు గోళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు వయసు మీద పడడం వల్ల వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పరిగడుపున అల్లం రసం తీసుకున్నట్లయితే ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది