Ginger Tea : అల్లం టీ వ‌ల్ల‌ ఇన్ని ఉపయోగాలా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ginger Tea : అల్లం టీ వ‌ల్ల‌ ఇన్ని ఉపయోగాలా…!

Ginger Tea : చాలా మందికి ఉదయాన్నే వేడివేడిటీ గొంతులో పడితే కానీ మనసు ఊరుకోదు.. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు కూడా.. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికిఎంతో మేలు చేస్తాయి. ప్రయాణాలలో కడప తిప్పే వారికి వాంతులు అయ్యే వారికి ఈ అల్లం టీ చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. కడుపుబ్బరం గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కి కూడా ఈ అల్లం టీ చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2023,7:00 am

Ginger Tea : చాలా మందికి ఉదయాన్నే వేడివేడిటీ గొంతులో పడితే కానీ మనసు ఊరుకోదు.. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు కూడా.. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికిఎంతో మేలు చేస్తాయి. ప్రయాణాలలో కడప తిప్పే వారికి వాంతులు అయ్యే వారికి ఈ అల్లం టీ చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. కడుపుబ్బరం గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కి కూడా ఈ అల్లం టీ చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్య ఔషధముల పనిచేస్తుంది. అప్పుడు వచ్చిన నొప్పిదూరం అవుతుంది.. దీనిని రోజు తాగితే మరీ మంచిది. 40,ఏళ్లు దాటిన వ్యక్తులకు నడుము నొప్పి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అల్లం టీ తాగవచ్చు. జలుబు, జ్వరం ఉన్నవారు అల్లం టీ తాగాలి. మెరుగైన రక్తప్ర ప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

శరీరం ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసి గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. సీజనల్ వ్యాధులకు అల్లం టీ తో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. అధిక బరువును తగ్గించే శక్తి కూడా అల్లం టీ కి ఉంది. దూరం చేసి గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం అల్లం టీ ని తీసుకుంటే ఉపయోగముంటుంది… దీంతో కూరలకు చక్కని రుచి వస్తుంది. అయితే రుచికే కాదు.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలోనూ అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లం లేకుండా మనం తయారు చేసే కూరలు తక్కువ ఉంటాయి. ఓన్లీ కర్రీస్ లో వేసుకోవడమే కాకుండా మనం అల్లం కషాయం తీసుకోవడం అట్లాగే పౌడర్ ఎక్కడైనా యూస్ చేయడం టీలోఅల్లం యూస్ చేయడం ఇలా రకరకాల ఫామ్స్ లో మనం అల్లం యూస్ చేసుకుంటూ ఉంటాము.

Ginger tea has so many uses

Ginger tea has so many uses

ఏ రకంగా వాడినా సరే అల్లంకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ వర్క్ అవుట్ చేసినప్పుడు వచ్చే మజిలిస్ పెయిన్స్ నుంచి రికవరీ రావడానికి కూడా అల్లం అనేది రెగ్యులర్గా డైట్ లో ఆడ్ చేసుకుంటే మంచిది.రోజు వేడినీటిలో అల్లం నిమ్మరసం తేనె మిశ్రమాలు కలిపి తీసుకున్న ఫలితం ఉంటుంది. తేనలో కొన్ని అల్లం రసం చుక్కల్ని వేసి ఓ మిశ్రమంగా కలిపి తీసుకుంటే జలుబు దగ్గు, నుంచి ఉపశమనం కలుగుతుంది.మహిళలు అల్లం టీ తాగితే ఉత్తమం. అలాగే రోగ నిరోధక శక్తి కూడా అల్లం టీతో పెరుగుతుంది. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. చల్లని వాతావరణంలో తీసుకోవడం వల్ల శరీరంలో వేడి కలుగుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది