Good Habits : మనం చేసే కోన్ని పొరపాట్ల వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది అనే సంగతి మీకు తెలుసా…!!
Good Habits : మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం మరియు నిత్యం ఖచ్చితంగా వ్యాయామం చేయడం లాంటి వాటిని అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అనే సంగతి తెలిసిందే. అలాగే కొన్ని సందర్భాలలో మంచి అలవాట్లు అనేవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మన ఆరోగ్యం పై […]
ప్రధానాంశాలు:
Good Habits : మనం చేసే కోన్ని పొరపాట్ల వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది అనే సంగతి మీకు తెలుసా...!!
Good Habits : మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం మరియు నిత్యం ఖచ్చితంగా వ్యాయామం చేయడం లాంటి వాటిని అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అనే సంగతి తెలిసిందే. అలాగే కొన్ని సందర్భాలలో మంచి అలవాట్లు అనేవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
– సాధారణంగా మాంసాహారంలో ప్రోటీన్లు అనేవి పుష్కలంగా దొరుకుతాయనే సంగతి తెలిసిందే. అయితే జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారు మాత్రం నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి అని అంటున్నారు. అలాగే ఈ నాన్ వెజ్ లో ప్రోటీన్లు మరియు సంతృప్త కొవ్వులు అనేవి అధిక మోతాదు లో ఉంటాయి. ఇవి గుండె సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఊబకాయం మరియు గుండె సమస్యలతో ఇబ్బంది పడేవారు నాన్ వెజ్ ను మితంగా తీసుకుంటే మంచిది అని అంటున్నారు. అలాగే మన ఆరోగ్యానికి మంచి చేసే నాన్ వెజ్ కూడా కొన్ని సందర్భాలలో మన ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి అని అంటున్నారు.
– పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పండ్లను మాత్రం డెజార్డ్ రూపంలో తీసుకోకూడదు అని అంటున్నారు నిపుణులు. ఇవి మన ఆరోగ్యంపై చేడు ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాక అన్నం తిన్న వెంటనే పండ్లను తీసుకున్న మన ఆరోగ్యం చేడు ప్రభావం పడుతుంది అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అలాగే కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ లాంటి సమస్యలు ఎదురవుతాయి అని అంటున్నారు…
వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి మంచిది అని ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్న టైంలో మాత్రం వ్యాయామానికి దూరంగా ఉండాలి అని అంటున్నారు. అయితే ఒత్తిడితో వ్యాయామ చేయడం వలన గుండె వేగం అనేది పెరుగుతుంది. అలాగే రక్తపోటు పెరగడానికి కూడా కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు…
– మనిషి బ్రతకడానికి మంచినీరు ఎంత ముఖ్యమో అలాగే అధిక మోతాదులో తీసుకున్న కూడా దుష్ప్రభావాలు కలుగుతాయి అని అంటున్నారు. అయితే మనం ఎక్కువ నీటిని తాగినప్పుడు కణజాలం వాపు మరియు శరీరంలో పలు భాగాలలో వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అందుకే అవసరానికి మించి వాటర్ ఎక్కువగా తాగకూడదు అని అంటున్నారు…
– మన ఆరోగ్యానికి మంచి చేసే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురి చేస్తుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లో మోతాదును మించి తీసుకుంటే మలబద్ధకం మరియు బరువు పెరగటం లాంటి సమస్యలకు దారి తీస్తుంది అని అంటున్నారు. అలాగే అలర్జీ మరియు మంట, దద్దుర్లు, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు