Diabetes patients : డయాబెటిస్ ఎందుకు వస్తుందో కనిపెట్టేశారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes patients : డయాబెటిస్ ఎందుకు వస్తుందో కనిపెట్టేశారు..!!

 Authored By jyothi | The Telugu News | Updated on :15 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Diabetes patients : గుడ్ న్యూస్...డయాబెటిస్ ఎందుకు వస్తుందో కనిపెట్టేశారు..!!

  •  Diabetes patients : టైప్ టు డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఒక గుడ్ న్యూస్.. ఈ మధ్య టైప్ టు డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

  •  డయాబెటిస్ సమస్య రావడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది.

Diabetes patients : టైప్ టు డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఒక గుడ్ న్యూస్.. ఈ మధ్య టైప్ టు డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది గనక సక్సెస్ అయితే ఇక డయాబెటిస్ అనే మాటకి భయపడే రోజులు పోతాయి. నిజానికి డయాబెటిస్ వచ్చిందంటే జీవితం అయిపోయింది అని చాలామంది డిప్రెషన్కు గురవుతూ ఉంటారు. నిజమే కదా.. ఇప్పుడున్న టెక్నాలజీ డయాబెటిస్ ని తగ్గించలేకపోతోంది. ఎన్ని మందులు వాడినా ఎలాంటి డైట్ తీసుకున్న షుగర్ వ్యాధితో అనేక ఇబ్బందులు పడుతున్నారు.చాలామంది ఇక ఏం తినడానికి ఉండదు. ఎక్కడికి వెళ్లడానికి ఉండదు. జీవితం సగం అయిపోయింది అనే భావనలోనికి వెళ్ళిపోతారు. కొంతమందికి మధుమేహం ఉన్న సంగతి కూడా తెలియదు. అసలు ఎందుకు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా మనకి షుగర్ వ్యాధి ఉందని గుర్తించాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. డయాబెటిస్ లో ఒక వ్యక్తి శరీరం ఇన్సులేను సమర్థవంతంగా ఉపయోగించదు.

సాధారణంగా టైప్ వన్ డయాబెటిస్ 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళకి వస్తుంది. దీన్ని నివారించలేం.. కానీ టైప్ టు డయాబెటిస్ ను నివారించవచ్చు.. అయితే టైప్ వన్ టైప్ టు డయాబెటిస్ రెండు బాల్యం లేదా యుక్త వయసులో ప్రారంభం కావచ్చు. వృద్ధుల్లో టైప్ టు మధుమేహం అనేది సర్వసాధారణం. ఈరోజుల్లో చాలామంది పిల్లలు ఊబకాయం బారిన పడుతుండడం వల్ల యువకుల్లో టైప్ టు డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. టైప్ టు డయాబెటిక్ సర్వసాధారణంగా మారిపోయింది. జీవనశైలి మార్పుల కారణంగా చాలామంది యువకులు అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడ్డం దీనికి ప్రధాన కారణం. ఉబకాయం అనేది ఈ వ్యాధికి ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. పిల్లలు తగినంత వ్యాయామం చేయకపోవడం ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం లేదా రక్తసంబంధీకుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే వారికి టైప్ టు డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇది 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కలిగించే అవకాశం ఉంది.

డయాబెటిస్ సమస్య రావడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. అదే ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా డయాబెటిస్ వస్తుందని చాలామందికి తెలియదు. అయితే చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా అని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు..చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్ టు డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్యులు. అంతేకాదు.. ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇన్సూలేన్స్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. ఈ ఎంజాయి ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించవచ్చు.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ కదా కాబట్టి ఇప్పటికే మీరు డయాబెటిక్ బారిన పడితే కనుక భయపడకండి. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నారు. ముందు జాగ్రత్తగా మీ ఆహారపు అలవాట్లలో జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ మీకు ఏమాత్రం అనుమానం ఉన్న అంటే మధుమేహానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు అయినా మీకు కనిపించిన ముందుగా డాక్టర్ని సంప్రదించి తొందరగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది