Hair Benefits : పేలు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ మూడు చిట్కాలు మీ కోసమే!
Hair Benefits : పేలు సమస్యతో చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జుట్టులో పేలు ఉన్న వారు ఎక్కడ పడితే అక్కడే తలను గోకడం వంటివి చేస్తూ చూసే వారికి చిరాకు తెప్పిస్తారు. వారు తీవ్ర అవస్థలు పడుతూ… చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంటారు. అయితే ఈ పేలకు చిన్నా, పెద్దా, ఆడ, మగా అనే తేడా లేదు. ఒకరి నుంచి ఒకరికి కూడా పేలు ఎక్కుతుంటాయి. అయితే దీన్ని తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాలు షాంపూలు వాడతారు. పేలు చనిపోయే మందును వాడుతుంటారు. మరి కొందరైతే కిరోసిన్ వంటివి కూడా తలకు రాసుకుంటూ. పేలు కొరుకుతుంటే భరించలేక ఏదైనా చేసేస్తుంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
కానీ మేము చెప్పబోయే ఈ మూడు చిట్కాల ద్వారా తలలో ఉన్న పేలని వెంటనే చంపేయొచ్చు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిది… లకి నూనె పెట్టి పేలు మొత్తం పోయేలాగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వలన తలలో పేలు మొత్తం పోతాయి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల తలలో పేలు చాలా వరకు తగ్గుతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా ఒకే సారి చేయాలి. ఒక్కొక్కరు ఒక సారి చేయడం వల్ల ఒకరికి తగ్గినా ఇంకొకరి తలలో పేలు మళ్లీ వీళ్లకు వస్తాయి. అయితే రెండోది… మెడికల్ లో ఇవెర్మెక్టిన్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే చాలు తలలో పేలు మొత్తం చచ్చిపోతాయి.

Hair Benefits how to get rid of head lice naturally ivermectin tablet
ఈ టాబ్లెట్ రాత్రి ఒకటి వేసుకుని పడుకుంటే చాలు ఉదయానికి పేలు మొత్తం కదలలేని స్థితిలోకి వస్తాయి.ఉదయాన్నే దువ్వడం వలన పేలు మొత్తం పడిపోతాయి. ఇలా రెండు మూడు వారాల పాటు పేలు తగ్గేంత వరకు వారానికి ఒకసారి టాబ్లెట్ వేసుకోవడం వలన పేల సమస్య తగ్గుతుంది. అలాగే మూడోది.. పెర్లెస్ అని లోషన్ ఉంటుంది. ఈ లోషన్ అప్లై చేసి ఒక అలా వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి. తల స్నానం చేసిన తర్వాత తడి తడి తలను దువ్వడం వలన పేలు మొత్తం పడిపోతాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన పేలు మొత్తం తగ్గిపోతాయి. ఈ మూడు చిట్కాలలో ఏ ఒక్కటి ట్రై చేసిన ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి ట్రై చేస్తేనే ఫలితం కనిపిస్తుంది.