Hair Benefits : తలలో దురద చిరాకుగా ఉందా.. ఇలాచేస్తే నిమిషాల్లో మీ తలలో పేలు, ఈపులు మాయం..
Hair Benefits :తలలో పేలు ఈ సమస్యను ప్రతి ఒక్కరు ఎదుర్కొని ఉండే ఉంటారు. పేలు మరీ ఎక్కువగా ఉంటె చిరాకుతో జుట్టు పీకేయాలి అనిపిస్తుంది. ఏపనిపై ఏకాగ్రత ఉండదు. అయితే తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి పేలు వ్యాపిస్తుంది. చిన్న పిల్లల్లో పేలు సమస్య ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పిల్లలను అందరూ దగ్గరికి తీస్తారు కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లకు పేలు వస్తాయి. ఇవి తలలో ఈపులు పెట్టి జుట్టును చూడడానికి అసహ్యంగా తయారు చేస్తాయి. అయితే తడి జుట్టు, చుండ్రు వల్ల కూడా పేలు ఏర్పడతాయి .
పేలు నివారణకు వెల్లులి మంచి మిశ్రమం. కొన్ని వెల్లులి రెబ్బలు తీసుకొని మెత్తగా నూరి ఆ మిశ్రమానికి నిమ్మ రసం ను కలిపి జుట్టుకు పట్టించి ఓ గంట తర్వాత స్నానం చేస్తే తలలో ఉన్న పేలు అన్ని రాలిపోతాయి. ఇలా చేయడం వల్ల పేలు నుంచి ఉపశమనం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలకు పూసుకుంటే పేల భాద తొలగించవచ్చు.అలాగే నాలుగు హారతి కర్పూరం బిళ్లలు తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు స్పూన్ల కొబ్బరి నూనే కలపాలి. అలాగే ఇందులో అర స్పూన్ నిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకి పంట్టించాలి.
Hair Benefits : ఇలా చేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చు..
నునే పేలను మృదువుగా చేస్తుంది. అలాగే కర్పూరం ఘాటైన వాసనతో పేలను చంపుతుంది. ఇలా చేయడం ద్వారా కూడా పేల భాద నుంచి విముక్తి పొందవచ్చు. చికాకు, దురద నుంచి తప్పించుకోవడానికి కూడా ఇలా చేయవచ్చు.అలాగే వేపాకు మెత్తగా నూరి దానికి ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి ఓ గంట తర్వాత తల స్నానం చేస్తే పేలు రాలిపోతాయి. పైగా జుట్టు దృడంగా తయారవుతుంది. వెన్న ను రాత్రి పడుకునేముందు మాడకు పట్టించి మరుసటి రోజు ఉదయం దువ్వెనతో దూముతూ తర్వాత స్నానం చేస్తే కూడా పేలు రాలిపోతాయి.