Hair Benefits : ఆ ఆకులు తింటే.. హెయిర్ ఫాల్ కు బెస్ట్ సొల్యూషన్ మరెందుకు ఆలస్యం..
Hair Benefits : సాధరణంగా కరివేపాకును కేవలం కూరల్లో రుచికి మాత్రమే వాడుతుంటారు. ఇక కూరలో కరివేపాకు.. కరివేపాకును తీసి పాడేసినట్టు అంటూ ఇలా చాలా సామెతలను రెగ్యులర్గా వాడుతుంటాం. కానీ తినేప్పుడు మాత్రం దానిని తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే దాని వలన కలిగే ప్రయోజనాలు మనకు తెలియకపోవడమే. మెడికల్ భాషలో కరివేపాకును ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని అంటుంటారు. కరివేపాకును ఎక్కువగా తినడం వలన చర్మం, జుట్టు, ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అలాగే ఉదయం లేవగానే కరివేపాకును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచింది.
ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఉన్న వారు రోజూ కరివేపాకును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.రోజు మార్నింగ్ లేవగానే ఓక గ్లాసు మంచి నీళ్లు తాగి.. ఆ తర్వాత నాలుగైదు కరివేపాకుల్ని తినాలి. ఆ తర్వాత ఓ అరగంట వరకు ఏమి తినకుండా ఉండాలి. ఇలా చేయడం వలన కరివేపాకులో ఉండే విటమిన్ సీ, పాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మనం వాడే కొబ్బరి నూనేలో నాలుగైదు కరివేపాకులను వేసి గోరువెచ్చగా వేడి చేసి ఆ తర్వాత తలకు మర్ధన చేయడం

Hair Benefits grow thick hair with Curry tree
Hair Benefits : కరివేపాకులో పోషకాలెన్నో..
వలన జుట్టు నలుపు రంగులో ఉంటుంది.కొన్ని కరివేపాకు ఆకుల్ని ఆరబెట్టి పొడి చేసుకుని ఆవనూనెలో వేసి మరిగించాలి. ఇలా మరగబెట్టిన నూనెను రెండు రోజులు కదపకుండా ఉంచాలి. ఆతర్వాత ఫిల్టర్ చేసి నెలకి ఒకసారి జుట్టుకి పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు నల్ల బడుతుంది. అలాగే జుట్టు రాలడం, పలుచబడటం తగ్గుతుంది. మరో చిట్కా ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ లో కరివేపాకు వేసి మరిగించాలి. నీరు కలర్ కి రాగానే ఫిల్టర్ చేసి జుట్టుకి స్ప్రే చేయాలి. దీంతో పాటు పోషకాహారం, ఎక్కువగా వాటర్ తాగాలి.