Hair Tips : రోజూ 30 నిమిషాలు దీన్ని తలకు పట్టిస్తే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Hair Tips : ఈ మధ్య కాలంలో చాలా మందికి జుట్టు త్వరగా ఊడి పోవడం, బట్టతల రావడం, తెల్ల వెంట్రుకలు రావడం వంటివి జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండానే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అయితే వీటని తగ్గించుకునేందుకు ఆసుపత్రులు చుట్టూ, హెయిర్ క్లినిక్ ల చుట్టూ తిరుగుతున్నారు. వేలకు వేల డబ్బు ఖర్చు చేస్తూ.. షాంపూలు, హెయిర్ సిరమ్ లు, కండిషనర్లు, హెయిర్ స్ప్రేలు వాడుతున్నారు. అయితే వీటన్నిటి బదులుగా ఇంట్లో ఉండే అవిసె గింజలతోనే జుట్టును బాగు చేసుకోవచ్చు. మీకున్న అన్ని సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసకుందాం.ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని దానికి నాలుగు కప్పులు నీటిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా చేయడం వల్ల జెల్ తయారవుతుంది. కాస్త పలుచుగా ఉండగానే… స్టవ్ ఆఫ్ చేసి ఈ నేటిని వేడిగా ఉండగానే పలచటి బట్ట సాయంతో వడకట్టుకోవాలి. మరీ గట్టి పడితే.. వడకట్టు కోవడం చాలా కష్టం అవుతుంది. ఇలా వడకట్టిన జెల్ ని చల్లారిన తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మృదువుగా, పొడవుగా, నల్లగా, బలంగా, ఒత్తుగా తయారవుతుంది. అంతే కాకుండా పలు రకాల జుట్టు సమస్యలను కూడా తరిమి కొడుతుంది. అవిసె గింజల జెల్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారు అవుతాయి. అంతే కాకుండా జుట్టు చాలా త్వరగా వద్దన్నా విపరీతమైన పొడవుగా పెరుగుతుంది.అవిసె గింజల్లో విటామిన్ ఇ అధికంగా ఉంటుంది.
దీన్ని వల్ల స్కాల్ప్ కు పోషణ అందించి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగించే ముందు.. ఉపయోగించాక మీ జుట్టులో ఏర్పడే మార్పులను మీరే గమనించుకోవచ్చు. అయితే విటామిన్ ఇ చర్మం మరియు జుట్టు రెండింటికీ మేలు చేస్తుంది. అలాగే జుట్టు మూలాల వరకు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాదు తెల్ల జుట్టు సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఈ జెల్ ను హెయిర్ కండీషనర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా బలంగా తయారవుతుంది. అయితే ఈ జెల్ ను మీరు 10 నుంచి 15 రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు. అంతే కాకుండా దీనికి ఏదైనా నూనె కలపడం వల్ల మరిన్ని లాబాలు కల్గుతాయి.