Hair Tips : ఊడిన జుట్టు త్వరగా రావాలంటే ఇలా చేయండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఊడిన జుట్టు త్వరగా రావాలంటే ఇలా చేయండి..

 Authored By prabhas | The Telugu News | Updated on :29 July 2022,3:00 pm

Hair Tips : ఈ రోజుల్లో చాలామందికి జుట్టు ఊడిపోవడం సమస్య ఎక్కువ అవుతుంది. వాతావరణం లో కాలుష్యం వలన, ఆహార పద్ధతిలో మార్పుల వలన ఇలా పలు కారణాల వలన జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. జుట్టు పెరగడానికి వివిధ రకాల ట్రీట్మెంట్లను తీసుకుంటూ, వేలవేల డబ్బులను వృధా చేస్తుంటారు. అలా కాకుండా ప్రకృతిలో దొరికే కొన్ని పదార్థాలతో జుట్టును పెరిగేలా చేసామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉన్నవారు అలోవెరా జెల్ ను ఎక్కువగా రాస్తారు. అయితే అలోవెరా జెల్ కాకుండా దాన్ని జ్యూస్ లాగా చేసుకొని అప్లై చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.

జుట్టుకు సరిపడా అలోవెరా జెల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది లిక్విడ్ లాగా తయారవుతుంది. జెల్ అప్లై చేస్తే అది స్కాల్ప్ మీదనే ఉండిపోతుంది. జెల్ లాగా ఉండడం వలన కుదుళ్ల లోపలికి వెళ్లలేదు. అలోవెరా జెల్ ను జ్యూస్ చేసి అప్లై చేయడం వలన అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి కుదుళ్ళ లోపలి వరకు వెళ్లి జుట్టుని కుదుళ్ళ నుండి బలంగా చేస్తుంది. అలోవెరాలో విటమిన్ బి12 ఉంటుంది. 100 గ్రాముల అలోవెరా లిక్విడ్ లో 10.9 మైక్రోగ్రామ్స్, విటమిన్ బి 12 ఉంటుంది. శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అలోవెరా లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటాయి. ఇవి జుట్టు ఊడిన వెంటనే కొత్త వెంట్రుకలు రావటానికి బాగా సహాయపడుతుంది. ఇది జుట్టును డ్రై అవ్వకుండా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లలో ఆయిల్స్ రిలీజ్ చేసే కణజాలం ఉంటుంది.

Hair Tips for falling hair

Hair Tips for falling hair

ఇది స్కాల్ప్ మరియు హెయిర్ డ్రై అవ్వకుండా ఉండేలా చేస్తుంది. ఈ కణజాలం ఆయిల్స్ రిలీజ్ చేయకపోవడం వలన స్కాల్ డ్రై అయిపోయి చుండ్రు వస్తుంది. ఈ అలోవెరా జ్యూస్ అప్లై చేసినట్లయితే ఆయిల్స్ అవసరమైన మోతాదులో రిలీజ్ అయ్యి చుండ్రు సమస్య తగ్గుతుంది.అలోవెరా లిక్విడ్ అప్లై చేయడం వలన ఒక వెంట్రుక ఊడిన దగ్గర నుండి వెంట్రుకలు రావడానికి 20 రోజులు సమయం పడుతుంది. అలోవెరా లిక్విడ్ అప్లై చేస్తే వెంటనే వెంట్రుకలు వస్తాయి. అందుకే ఇకనుండి అలోవెరా జెల్ కాకుండా అలోవెరా జ్యూస్ అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలోవెరా జెల్ కంటే అలోవెరా లిక్విడ్ జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. జుట్టుకురుల వరకు ఇంకి కొత్త వెంట్రుకలు త్వరగా రావటంలో ఈ అలోవెరా లిక్విడ్ సహాయపడుతుంది. అందుకనే అలోవెరా జెల్ కాకుండా అలావేరా లిక్విడ్ ని ఉపయోగించండి. ఇది జుట్టు రాలడం సమస్యను తగ్గించి చుండ్రు లేకుండా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది