Hair Tips : ఈ చిట్కాతో రెండు లాభాలు జుట్టు పెరుగుతుంది… కొలెస్ట్రాల్ తగ్గుతుంది…
Hair Tips : కరక్కాయను మన పూర్వీకులు బాగా ఉపయోగించేవారు. దీనిని దగ్గు, జలుబు వచ్చినప్పుడు వేడి నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లను త్రాగేవారు. ఇలా త్రాగడం వలన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందేవారు. ఈ కరక్కాయ లో జలుబు, దగ్గులను నివారించే కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కరక్కాయ వలన ఇటువంటి లాభాలే కాకుండా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి అని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ కరక్కాయతో నాలుగు ఫలితాలను పొందవచ్చు. ఏంటంటే మొదటిగా మన శరీరంలో గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఉండే టానిన్స్, ఎంథోకీనోన్స్, పాలీఫినోస్ ఎక్కువగా ఉంటాయి.ఇది మీ పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు మనం తిన్న ఆహారం పొట్ట పేగులలో ఎక్కువసేపు నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కావున కరక్కాయ ను తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
కరక్కాయను పొడి లాగా చేసుకుని మజ్జిగలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. రెండవది కరక్కాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు నాలుగు రకాల కెమికల్ కాంపౌండ్స్ వలన మన శరీరంలోని ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఈ కరక్కాయ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గా పనిచేస్తాయి. ఇవి ప్రేగులలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. అలాగే శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్న తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మూడవదిగా ఈ కరక్కాయ అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గటానికి బాగా సహాయపడుతుంది. కరక్కాయ బాడీలోని మెటాబాలిజం ను యాక్టివేట్ చేసి బాడీలోని అనవసరపు కొవ్వులు కలిగిస్తుంది. దీనికి సెల్ బర్నింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Hair Tips how to grow hair and reduce cholesterol
కనుక అధిక బరువు ఉన్నవారు కరక్కాయను పొడి లాగా చేసుకుని తింటే బరువు తగ్గుతారు. నాలుగవదిగా కరక్కాయ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. కరక్కాయను పొడి లాగా చేసుకుని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఇలా కలిపితే మెత్తని క్రీం లాగా తయారవుతుంది. జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ కరక్కాయతో చేసిన క్రీమ్ ను తలమాడుకు రాస్తే జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా ఉంటుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ కరక్కాయను పొడి లాగా చేసుకుని వేడినీళ్లలో వేసి బాగా కలుపుకొని వాడుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కరక్కాయతో చేసిన మిశ్రమాన్ని రెండు పూటలా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గుతారు.అందువలన కరక్కాయతో ఇన్ని లాభాలు ఉన్నాయి.