Hair Tips : ఇలా చేసారంటే ఒత్తైన జుట్టు మీ సొంతం…
Hair Tips : ఎవరైనా సరే జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా నిగ నిగలాడాలని కోరుకుంటారు. దీనికోసం వివిధ రకాల ట్రీట్ మెంట్ లను తీసుకుంటూ ఉంటారు. వేల వేల డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. దీనికి బదులుగా మన ఇంట్లో దొరికే పదార్థాలతో సులువుగా జుట్టును కాపాడుకోవచ్చు. అది ఎలాగంటే మెంతులతో మన జుట్టును ఒత్తుగా తయారు చేసుకోవచ్చు. మెంతులను పేస్టులాగా చేసుకుని జుట్టుకు ఉపయోగించడం వలన మంచి ఎదుగుదల ఉంటుంది. మెంతుల వలన జుట్టుకు మంచి లాభం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెంతులను ఆహారంలో తీసుకోవడం వలన డయాబెటిస్ కూడా తగ్గుతుంది. రక్తంలో ఇన్సులిన్ ను పెంచి డయాబెటిస్ రాకుండా మెంతులు కాపాడుతాయని సైంటిస్టులు నిరూపించారు.
ఇలాంటి మెంతులు శరీరం లోపలే కాకుండా బయటగా ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టుకుదురులకు ఉండే రక్తనాళాలను వ్యాకోచింప చేస్తుంది. దీని వలన ఎక్కువ రక్త ప్రసరణ జుట్టు కుదుళ్లకు జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగితే కుదుళ్లకు పోషకాలు అందుతాయి. దీని వలన జుట్టుకుదురులు బలంగా ఏర్పడి, కురులు ఎదగటానికి సహాయపడతాయి. అలాగే మెంతులలో ఉండే లెసీథీన్ అనేది జుట్టు కుదుళ్లను పొడిబారకుండా చేస్తుంది. ఇలా జుట్టూ పొడి బారినప్పుడు కురులు ముక్కలుగా విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. ఈ లెసీథీన్ అనేది జుట్టుకుదుర్లను హైడ్రేట్ చేయడానికి బాగా సహాయపడుతుంది.
ఇన్ని లాభాలు ఉన్న మెంతులను పేస్టు లాగా చేసుకుని జుట్టుకు పెట్టుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మెంతులతో పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను ఒక ఐదు ఆరు గంటలసేపు నీటిలో నానబెట్టుకోవాలి. అంటే రాత్రి సమయంలో నానబెట్టుకొని ఉదయాన్నే ఉపయోగించాలి. ఇలా నానబెట్టుకున్న వాటిలో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పేస్టును ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. లేదా మామూలుగానే ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పేస్టును తలమాడుకు బాగా పట్టించాలి. తర్వాత ఒక అరగంట సేపు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.