Hair Tips : ఈ డికాషన్ వాడితే మీ జుట్టుకి తిరుగులేని పెరుగుదల… డబల్ హెయిర్ గ్రోత్ పక్కా…!
Hair Tips : చాలామంది పొడవు జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో కొంచెం ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. చాలామందిలో ఈ జుట్టు సమస్యలు మనం చూస్తూనే ఉంటాం. జుట్టు పొడవు తక్కువగా ఉంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడేవారు కూడా ఈ చిట్కా చాలా బాగా యూస్ అవుతుంది. దీనిలో వాడేవి అన్ని నేచురల్ గా మన ఇంట్లో దొరికేవి.. కావున వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు దీనిని వయసు తరహా లేకుండా అందరూ వాడవచ్చు..
దీని తయారు చేసుకోవడానికి మొదటగా రెండు స్పూన్ల మెంతులు ఒక బౌల్లో వేసుకోవాలి. దాన్లో ఒక గ్లాసు నీటిని పోసి 10 నిమిషాల వరకు బాగా మరగబెట్టాలి. ఈ మెంతులు అనేవి జుట్టుకి ఒక సంజీవినిలా పనిచేస్తాయి. వీటిని వాడడం వలన జుట్టు ఎదగడమే కాకుండా చుండ్రు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే జుట్టు సిల్కీగా, స్మూతీగా తయారవుతుంది. తరువాత ఒకటిన్నర చెంచా రోజ్ మేరీ ఆకులను కూడా వేసి బాగా మరగబెట్టుకోవాలి.ఇలాంటిది ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతుంది. ఇది జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. నీటిని బాగా మరిగిపెట్టిన తర్వాత దానిని స్టవ్ పై నుంచి దింపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆముదం కూడా వేసుకోవచ్చు..
ఈ ఆముదం మంచి హెయిర్ కండిషన్ల ఉపయోగపడుతుంది. తర్వాత ఒక స్పూన్ అలవేరా జెల్ ని కూడా తీసుకోవాలి. ఇది మన జుట్టుని సిల్కీగా అండ్ స్మూతీగా తయారు చేస్తుంది. ఈ వీటిని బాగా కలిపి ఒక వైట్ క్రీమ్ లా తయారు చేయాలి. తర్వాత మనం చల్లార్చిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్ట్ ని వడకట్టుకొని ముందుగా తయారు చేసుకున్న ఆముదం అలాగే అలోవెరా జెల్ క్రీమ్ లో కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని జుట్టుకి కుదురుల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఒక 60 నిమిషాల పాటు ఉంచుకొని ఏదైనా గాడత తక్కువ గల షాంపుతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన మీ జుట్టు డబల్ గ్రోతింగ్ చూస్తారు…!