Hair Tips : జుట్టు పెరగడానికి చక్కని పరిష్కారం ఈ చిట్కా!!
Hair Tips : ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం మన దేశంలో పెరుగుతున్న కాలుష్యం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా పలు కారణాల వలన జుట్టు రాలే సమస్య వస్తుంది. దీనికోసం మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయిన జుట్టులో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఈ సమస్యలన్నింటిని దూరం చేసుకోవాలంటే ఇంట్లో కొన్ని పదార్థాలతో చిట్కాను తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కాల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కనుక ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఉంటే ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా జుట్టుకు సరిపడాఉల్లిపాయలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ రసంలో గుడ్డు కలిపి అప్లై చేసుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. గుడ్డు మరియు ఉల్లిపాయలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పోషకాలు ఉంటాయి. అలాగే కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెండు స్పూన్ల అల్లం రసంలో రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్మానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే తమలపాకులు జుట్టు పెరగడానికి బాగా సహాయపడతాయి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తమలపాకులు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి జుట్టు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ను అందిస్తుంది. మెంతులు మన జుట్టుకు కావలసిన పోషకాలను అందిస్తాయి. మెంతులు తలకు అప్లై చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
ఇప్పుడు ఒక కడాయి తీసుకుని చిన్న బాటిల్ కొబ్బరినూనె వేసుకోవాలి. నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తమలపాకు ముక్కలను, రెండు స్పూన్ల మెంతులు వేసి బాగా మరిగించుకోవాలి. తమలపాకు, మెంతులు, వెల్లుల్లి ఉండే పోషకాలు నూనెలోకి దిగుతాయి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వాలి. తర్వాత వడగట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను వారానికి మూడుసార్లు కొద్దిగా వేడి చేసి తలకు అప్లై చేసి ఐదు పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. నూనె రాసుకున్న తర్వాత ఒక గంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాలు వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు మన ఇంట్లో వస్తువులతో సులువుగా ఈ చిట్కాలను తయారు చేసుకోవచ్చు