Hair Tips : ఉల్లిపాయతో ఇలా చేసారంటే… మీ జుట్టు ఒత్తుగా గడ్డిలాగా పెరుగుతుంది…
Hair Tips : చాలామంది జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆధునిక కాలంలో ఇది సాధ్యపడదు. ఎందుకంటే రోజురోజుకీ పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. పొల్యూషన్ వలన జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. దీని వలన జుట్టు సన్నగా తయారవుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యలు, తెల్ల జుట్టు రావడం లాంటి మొదలగు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమెడీతో ఇటువంటి సమస్యలన్నింటిని తొలగించుకోవచ్చు. ఈ రెమెడీని ఉపయోగించడం వలన జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా తయారవుతుంది. అలాగే జుట్టు ఎంత పలుచగా ఉన్నా సరే ఈ రెమిడితో ఒత్తుగా పెరుగుతుంది. ఈ రెమెడీని చిన్నవారి నుంచి పెద్దవారు దాకా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు.
అయితే ఈ రెమిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు మన జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మన జుట్టులో కెరోటిన్ లోపం ఉండడం వలన ఈ సమస్యలు అనేవి వస్తాయి. అయితే ఈ ఉల్లిపాయలో కెరోటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన జుట్టుకు సరిపడా ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో నాలుగు రెబ్బల కరివేపాకులను వేయాలి. ఈ కరివేపాకు జుట్టు కుదురులను బలంగా ఉంచి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత ఇందులోకి కలోంజి బ్లాక్ సీడ్స్ ఆయిల్ ను ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది జుట్టు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.
తరువాత టి ట్రీ ఆయిల్ ను మూడు లేదా నాలుగు చుక్కలు వేసుకోవాలి. ఇది తలలో వచ్చే దురద వంటి సమస్యలను తొలగిస్తుంది. తర్వాత అందులోకి రెండు స్పూన్ల కలబంద గుజ్జును వేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ జుట్టు పెరగడానికి చుండ్రు నుంచి విముక్తి పొందడానికి బాగా సహాయపడుతుంది. ఇలా వేసుకున్న మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత జుట్టుకు ఆయిల్ రాయకుండా ఈ పేస్టును రాసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టు చిగుర్ల నుంచి కుదుర్ల దాకా మొత్తానికి అప్లై చేయాలి. ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ రోజు వారి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు ఒత్తుగా గడ్డి లాగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.