Health Problems : ఇవి ఎక్కవగా తీసుకుంటే అంతే సంగతి… ఈ మూడు ప్రాబ్లమ్స్ మీ వెంటే ఇంకా
Health Benefits : వేరుశనగలను పల్లీలు అని, వేరుశనగలు అని, గ్రౌండ్ నట్స్, పీనట్స్ అనిఇలా చాలా పేర్లతో పిలసుస్తారు. వీటి వల్ల చాలానే ప్రయోజనాలున్నాయి. వేరుశనగలో పిండి, పీచు పదార్థాలు అధికం. ప్రొటిన్లు కూడా తగు మోతాదులో ఉంటాయి. ఇక విటమిన్లలో సి, ఎ, బి6 ఎక్కువగా ఉంటాయి. ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా వేరుశెనగల్లో మెండుగా ఉంటాయి. సాధారణంగా 100 గ్రాముల వేరుశెనగల్లో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రొటిన్లు, 49.2 గ్రాముల ఫ్యాట్, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.పల్లీలు తీసుకుంటే గుండె పనితీరు మెరుగు అవతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.
మెదడు పనితీరును కూడా పల్లీలు మెరుపరుస్తాయి. అల్జీమర్స్‌ను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. వీటిలోని విటమిన్ బీ3 ఇందుకు దోహదం చేస్తాయి. ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. చెడు కొవ్వును తగ్గిస్తాయి.సెరోటోనిన్(ఎమైనో ఆసిడ్ ట్రిప్టోఫాన్ నుంచి తయారయ్యే మోనోఎమైన్)ను విడుదల చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, విటమిన్ ఇ అధికం. తద్వారా గుండె నుంచి ఇతర భాగాలకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు ముసుకుపోకుండా కాపాడతాయి. పొట్టలో పడే క్యాన్సర్‌ను కూడా వేరుశెనగలు తప్పించగలవు.
Health Problems : ఎక్కువగా తీసుకుంటే..
మెదడుకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి. బరువు, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.వీటిని మరీ ఎక్కువగా వాడితే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు తక్కువగా తినాలి. వీళ్లు కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్‌ఎసిడిటీకీ కారణమవుతాయి. పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్‌జిలస్ ఫ్లేవస్ అనే ఫంగస్ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్ అనే విషరసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది.