Black Pepper : రోజు నల్ల మిరియాలను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Black Pepper : రోజు నల్ల మిరియాలను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా…!!

Black Pepper : సుగంధ ద్రవ్యాలలో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మిరియాలు అనేవి ఆహారానికి ఎంతో రుచిని కూడా ఇస్తాయి. అయితే వీటిని ఆయుర్వేద ప్రకారం చూస్తే,ఇవి జలుబు మరియు దగ్గు, ఉబ్బసం లేక జీర్ణ శక్తి లేకపోవడం లాంటి వాటికి ఔషధంగా కూడా వాడతారు. ఇది కాలేయం యొక్క పనితీరును కూడా ఎంతో వేగవంతం చేస్తుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతుంది. ఈ మిరియాల లో ఉండే […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 October 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Black Pepper : రోజు నల్ల మిరియాలను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా...!!

Black Pepper : సుగంధ ద్రవ్యాలలో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మిరియాలు అనేవి ఆహారానికి ఎంతో రుచిని కూడా ఇస్తాయి. అయితే వీటిని ఆయుర్వేద ప్రకారం చూస్తే,ఇవి జలుబు మరియు దగ్గు, ఉబ్బసం లేక జీర్ణ శక్తి లేకపోవడం లాంటి వాటికి ఔషధంగా కూడా వాడతారు. ఇది కాలేయం యొక్క పనితీరును కూడా ఎంతో వేగవంతం చేస్తుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతుంది. ఈ మిరియాల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మిరియాల లో సంతృప్త కొవ్వులు మరియు కొలెస్ట్రాల్,సోడియం లాంటివి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ సిమరియు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె, కాపర్, మాంగనీస్, ఐరన్ లాంటివి కూడా ఉంటాయి. అయితే ఈ నల్ల మిరియాల లో ఉండే యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ అల్జరిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ గ్యాస్, డయూరిటిక్, డైజెస్టిక్ లాంటి ఎన్నో లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నల్ల మిరియాలను తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి దగ్గు ముఖం పడతాయి. దీని ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక షుగర్ తో ఇబ్బందిపడే వారికి సైతం ఈ మిరియాలు బెస్ట్. ఇవి జీర్ణ వ్యవస్థను మరియు రోగనిరోధక శక్తిని బలంగా చేస్తాయి. అలాగే బరువును తగ్గించటంలో కూడా హెల్ప్ చేస్తాయి. ఇవి క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే వీటిలో విటమిన్ సి మరియు విటమిన్ ఏ మరియు ఫ్లేవనా యిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి కణాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచటంలో మేలు చేస్తాయి. ఈ మిరియాలను తీసుకోవటం వలన జీర్ణ సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే వీటిలో ఉన్న పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాని కూడా వృద్ధి చేస్తాయి…

Black Pepper రోజు నల్ల మిరియాలను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా

Black Pepper : రోజు నల్ల మిరియాలను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా…!!

మిరియాలను తీసుకోవడం వలన దగ్గు తొందరగా తగ్గిపోతుంది. దీనితో పాటుగా శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ అనేవి రాకుండా అడ్డుకుంటుంది. ఈ నల్ల మిరియాలను తీసుకోవటం వలన రొమ్ము మరియు ప్రెస్టేజ్, పెద్ద పేగు క్యాన్సర్ లాంటి రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. వీటిని ఇతర రూపాలలో తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఊపకాయంతో ఇబ్బంది పడేవారు నల్లమిరియాలు తీసుకుంటే చాలా మంచిది. ఈ మిరియాలలో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి వాపు మరియు దీర్ఘకాలిక సమస్యలను నయం చేస్తాయి. అలాగే ఈ మిరియాలు తింటే అస్తమా మరియు వాపు అర్థరెట్టిస్ లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది