Health Benefits : ఈ కాయల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు… వదిలి పెట్టకుండా తినేస్తారు…
Health Benefits : మన పూర్వీకులు బుడమ కాయలను ఎక్కువగా వాడేవారు. బుడమ కాయతో పప్పు, కూర, పచ్చడి చేసుకుని తినేవారు. బుడంకాయలు తీగలు తీగలుగా పారుతాయి. ఎక్కువగా పంట పొలాల్లో కనిపిస్తాయి. ఇది కొద్దిగా తీపి రుచుని కలిగి ఉంటాయి. బుడమ కాయలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బుడమ కాయలను విటమిన్ సి,ఎ పోలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్, ఫైబర్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో తినాలనే కోరికను తగ్గిస్తుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తుంది. అలాగే శరీర కణాల పెరుగుదల మరియు మరమ్మత్తును ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ముఖంపై ముడతలు, మచ్చలు రాకుండా చేస్తుంది. బుడమ కాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఈ బుడంకాయలను తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను ఒక నియంత్రణలో ఉంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ బుడమ కాయలను కామెర్లు చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది. ఈ కాయలు తినడం వలన వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది.