Health Benefits : ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి… వజ్రం కంటే విలువైనది…!
Health Benefits : ప్రకృతి మనకి ప్రసాదించిన మొక్కలలో చాలా మొక్కలు మనకి వజ్రాల కంటే విలువైనవి గా పరిగణించబ డుతున్నాయి. ఎందుకంటే ఈ మొక్కలకి కాచే కాయలు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నా యి. ఇప్పుడు ఆ వజ్రం కంటే విలువైన కాయ వచ్చేసి బుడమకాయ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బుడమ కాయ సూపు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లి ,ఉల్లి వేసి పోపు చేసిన తర్వాత ఈ బుడమ కాయలను ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పసుపు వేసి నీరు పోసి బాగా మరగ పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిని సూప్ గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
అయితే సహజంగా పల్లెటూర్లలో ఈ మొక్కలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఈ కాయలు పంట పొలాల్లో బాగా ఉంటాయి. ప్రస్తుతం మన ఉన్న జనరేషన్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మనకి లభిస్తున్నాయి. అందులో ఈ బుడమకాయ కూడా చాలా ముఖ్యమైనది. దీంతో ఆవకాయ, కూర, పప్పు, పచ్చడి కూడా వండుకోవచ్చు. ఈ కాయలు ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటి వలన ఎటువంటి ఆరోగ్య ఉపయోగాలు కలుగుతాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ బుడమ కాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ బుడమ కాయలలో విటమిన్ ఏ, ఐరన్ ,ఫైబర్ ,పాస్పరస్, జింక్, పోలిక్, క్యాల్షియం లాంటి ఆంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఈ కాయల తీసుకోవడం వలన కాలేయం పనితీరు కూడా మెరుగుపరచడమే కాకుండా కామెర్ల చికిత్సలో కూడా బాగా సహాయపడతాయి.
అలాగే ఈ కాయలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వలన సన్నని గీతలు, మచ్చలు, ముడతలు, చర్మ వృద్ధాప్య సాంకేతాలను తగ్గిస్తాయి. అదేవిధంగా అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బుడమ కాయలలో ఫైబర్ అధికంగా ఉండడం వలన వీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు తినాలని అనిపించదు. దాని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ బుడమ కాయలతో చేసిన కూరను తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే చక్కెర లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.