Butter Milk : ప్రతిరోజు ఉదయాన్నే టీ,కాఫీ కి బదులుగా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి… బోలెడు లాభాలు…!!
ప్రధానాంశాలు:
Butter Milk : ప్రతిరోజు ఉదయాన్నే టీ,కాఫీ కి బదులుగా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి... బోలెడు లాభాలు...!!
Butter Milk : సాధారణంగా ఎంతో మందికి నిద్రలేచిన వెంటనే టీ లేక కాఫీని తాగే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం లేచిన వెంటనే కాళీ కడుపుతో ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం ఇకమీదట మీరు ఇదే అలవాటు చేసుకుంటారు. ఎందుకు అంటే ఈ మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మజ్జిగలో ఉన్న గుణాలు ఆహారం ఈజీగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం మరియు అజీర్ణం లాంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది…
ప్రతిరోజు ఉదయాన్నే మజ్జిగ తాగడం వలన పొట్టను చల్లగా ఉంచడమే కాక కడుపులోని మంటను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక అసిడిక్ రిఫ్లెక్షన్ వలన పొట్టలో వచ్చే చికాకును కూడా తొలగిస్తుంది. అంతేకాక ఎప్పుడు జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడేవారు రోజు ఆహారం తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీనిలో ఉన్న గుణాలు గుండెను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మీరు వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగటం వలన కండరాల నొప్పులను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే ఇది మజిల్ బిల్డింగ్ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని కూడా ఈజీగా పెంచుతుంది. దీని కారణం చేత జలుబు మరియు దగ్గు లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది చర్మాన్ని ఎంతో మృదువుగా కూడా ఉంచుతుంది. అలాగే ముఖంపై వచ్చే మొటిమలు మరియు మచ్చలను కూడా తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. దీనితోపాటుగా చర్మాని ఎంతో కాంతివంతంగా మారుస్తుంది. అలాగే వేసవిలో మజ్జిగ తాగటం వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే దీనిలో ఉన్న గుణాలు శరీరానికి ఎంతో చలదానాన్ని ఇస్తాయి. వీటితోపాటుగా బాడీలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అయితే మజ్జిగలో ఎక్కువ శాతం నీరు అనేది ఉంటుంది. కావున ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది…