మజ్జిగ లోని విశిష్ఠలు తెలిస్తే అసలు వదిలిపెట్టారు
buttermilk : మజ్జికను buttermilk చల్ల అని కూడా పిలుస్తారు.. చల్ల అని పేరు ఎందుకు పెట్టారో కానీ మజ్జిగ నిజంగానే చలువచేసే చల్లని తల్లి! మనకు వచ్చిన అనేక రకాలైన జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కువగా మజ్జిగను లేదా మజ్జిగ అన్నం కలిపి పిసికి రసం తీసుకోని తాగటం లాంటివి చేస్తాం. ఎక్కువగా మందులు వాడే సమయంలో సహజంగా వేడి చేస్తుంది, దాని నుండి తప్పించుకోవటానికి మజ్జిగ ఎక్కువగా వాడవచ్చు.
నీళ్ల విరోచనాలు కానీ, రక్త విరోచనాలు, జిగట విరోచనాలు అవుతున్న సమయంలో మజ్జిగ buttermilk వాడటం చాలా అవసరం. జిగట విరోచనాలు ( అమీబియాసిస్ ) చాలా ప్రమాదకరమైనవి. ఇవి నిదానంగా వ్యాపించి మనిషిని రక్తహీనతకు గురిచేస్తాయి. వీటివల్ల క్రమేపి నీరసం వస్తుంది. ఇలాంటి అమీబియాసిస్ తగ్గాలంటే లీటర్ల కొద్దీ మజ్జిగ తాగాలి. అయితే మజ్జిగ వాడేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించాలి. మజ్జిగలో వెన్న ఉండకూడదు. ఇది హృద్రోగులకు దారి తీయవచ్చు. కాబ్బటి వెన్నలేని పల్చని నీళ్ల మజ్జిగ వాడితే మంచిది.
buttermilk : ఈ వేసవి కాలంలో మజ్జిగను తీసుకుంటే…
ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవటానికి బజార్లో దొరికే సోడాలు , వాటర్ తాగటం కంటే కూడా మజ్జిగను తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. వడదెబ్బ తగలదు. దాహం తీరుతుంది. మజ్జిగలో అల్లం, కరివేపాకు వేసుకుంటే మరి మంచిది. పూర్వకాలంలో రాత్రిపూట అన్నంలో పాలుపోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తోడు పెట్టి ఉదయాన్నే దాన్ని అల్పాహారంగా తీసుకునేవాళ్ళు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద మందులు వాడేటప్పుడు చాలా మందులు మజ్జిగతోనే వేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మజ్జిగ అంటే పెరుగులో కాసిని నీళ్లుపోస్తే వచ్చేదే అనుకోవద్దు. అది అసలు మజ్జిగ కాదు. పెరుగుకు, మజ్జిగకు చాలా తేడా ఉంటుంది. పెరుగు రాత్రి పూట వేసుకుంటే అయుక్షిణం అంటారు, కానీ మజ్జిగకు అలాంటివి ఏమి లేవు. పెరుగును బాగా కవ్వంతో నురుగు వచ్చే వరకు చిలకరించితేనే మజ్జిగ వస్తుంది. అంతేకాని పెరుగులో కాసిని నీళ్లు పొసి కలిపితే మజ్జిగ అయిపోదు..