Sleep : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా… పడుకునే ముందు ఈ జ్యూస్ తాగితే…!
ప్రధానాంశాలు:
Sleep : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా... పడుకునే ముందు ఈ జ్యూస్ తాగితే...!
Sleep : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు మరియు బిజీ లైఫ్ కారణంగా చాలామంది అధిక ఒత్తిడి మరియు నిద్రలేమి Sleep సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతి వ్యక్తి సగటున రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. ప్రశాంతంగా సరిపడా నిద్ర పోయినప్పుడే శరీరం ప్రశాంతంగా, జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. లేకపోతే నిద్రలేమితో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కొన్ని రకాల జ్యూస్ లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పనులలో చెర్రీ పండ్లు అతి ముఖ్యమైనవిగా పరిగణిస్తున్నారు.
ఈ చెర్రీ పండ్లతో నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలియజేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తగిన మోతాదులో చెర్రీ జ్యూస్ ను నిద్రించడానికి రెండు గంటల ముందు తీసుకోవడం చాలా మంచిదట. ఈ విధంగా తీసుకోవడం వలన నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాక ఈ చెర్రీ జ్యూస్ ఆరోగ్యం పై కూడా మరింత ప్రభావితంగా పనిచేస్తుంది. ఎందుకంటే చెర్రీ జ్యూస్ లో మెలటోనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని స్లీప్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది నిద్రను ప్రోత్సహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మనం ఎప్పుడూ నిద్రించాలి ఎప్పుడు నిద్ర లేవాలి అనే విషయాలను తెలపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
అంతేకాక చెర్రీ పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కావున నిద్రించడానికి రెండు గంటల ముందు చెర్రీ జ్యూస్ లేదా చెర్రీ పండ్లు తిని పడుకుంటే హాయిగా నిద్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి సమయంలో దీన్ని తీసుకోవడం వలన కొద్ది రోజుల్లోనే సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది.