Coriander Juice : కొత్తిమీర జ్యూస్ తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coriander Juice : కొత్తిమీర జ్యూస్ తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :8 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Coriander Juice : కొత్తిమీర జ్యూస్ తీసుకోండి... ఈ సమస్యలకు చెక్ పెట్టండి...!

Coriander Juice : కొత్తిమీర దాదాపు అన్ని వంటలలో కూడా అధికంగా వాడే ముఖ్యమైన ఆహార పదార్థం. ఇది Apiaceae మొక్కల కుటుంబానికి చెందినది. అయితే కొత్తిమీర ఆకులు, కాండం, వేర్లు అన్నిటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కొత్తి మీర ఆకులు అనేవి కిడ్నీ టాక్సిన్స్ నియంత్రించి కిడ్నీ సమస్యల నుండి దూరం చేస్తుంది. ఈ కొత్తిమీర ఆకులనేవి మన మూత్రపిండాలకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే మీ కిడ్నీలను క్లీన్ చేసేందుకు మీరు కొన్ని సహజ ఉత్పత్తులను వాడవచ్చు. దీనిలో భాగంగా కొత్తిమీర కిడ్నీ టాక్సిన్ లను బయటకు పంపించడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. ఈ కొత్తిమీరలో యాంటీ మైక్రో బయాల్, యాంటీ ఎఫిలేఫ్టిక్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కావున ఈ లక్షణాలు అనేవి మూత్రపిండాల పనితీరుకు ఎంతో సహాయం చేస్తాయి. ఇది డయేరియాకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది…

కొత్తిమీర నీటిని ఎలా తయారు చేయాలి : ముందుగా కొత్తిమీర ఆకులను తీసుకోవాలి.ఈ ఆకులను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ఆకులను పొడిగా చేసుకొని నిల్వ చేయొచ్చు. మీకు అవసరమైన టైమ్ లో ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించి చల్లారనివ్వాలి.ఆ తర్వాత ఈ రసం లో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని ప్రతినిత్యం తీసుకోవాలి.ఈ కొత్తిమీర నీటిని ప్రతినిత్యం తాగడం వలన కిడ్నీ సమస్యలు నుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది…

Coriander Juice కొత్తిమీర జ్యూస్ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు

•కొత్తిమీర కట్ట.
•నిమ్మరసం.
•నీరు.
•ఉప్పు.

కొత్తిమీర రసాన్ని తయారు చేసే విధానం : కొత్తిమీర జ్యూస్ ను తయారు చేయడానికి, ముందుగా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి. దీని తర్వాత వాటిని ఎంతో శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.తర్వాత ఆకులను కట్ చేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.దీనిని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని ఫిల్టర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాని తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి.

Coriander Juice కొత్తిమీర జ్యూస్ తీసుకోండి ఈ సమస్యలకు చెక్ పెట్టండి

Coriander Juice : కొత్తిమీర జ్యూస్ తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…!

Coriander Juice కొత్తిమీర నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు

1.జీర్ణక్రియ : కొత్తిమీర ఆకులు జీర్ణక్రియ కు ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులను తీసుకోవడం వలన పొట్ట క్లీన్ గా ఉండి గ్యాస్ లాంటి సమస్యలు రావు.
2. శరీరం నిర్విషికరణ : ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులను తీసుకోవటం వలన దారిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో ఎంతో మేలు చేస్తుంది.
3. రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది : కొత్తిమీర ఆకులలో విటమిన్ సి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలంగా తయారు చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : కాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగడం వలన అధిక రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంచుతుంది.అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా కంట్రోల్లో ఉంచుతుంది.
5. నొప్పుల నుండి ఉపశమనం : శోథ నిరోధక గుణలు అధికంగా ఉన్న కొత్తిమీర ఆకుల నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కీళ్లవాపు మరియు కీళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది