Health Benefits : కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే… ఈ ఆకుల జ్యూస్ ను తాగాల్సిందే…
Health Benefits : ఇప్పటి వారు ఎక్కువగా టెలివిజన్లు, మొబైల్స్ కు బానిసలు అయిపోయారు. పరిమితికి మించి వీటిని చూస్తున్నారు. భోజనం లేకుండా అయినా ఉంటారు కానీ టెలివిజన్, మొబైల్స్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారు. వీటిని ఎక్కువగా చూడడం వలన కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా కంటి నుంచి నీరు కారడం, కంటి చూపు తగ్గడం లాంటివి బాగా వస్తున్నాయి. చిన్న వయసులోనే కళ్లద్దాలను ధరిస్తున్నారు.మొబైల్స్ ను, టెలివిజన్ లు చూడడం ఎలాగూ ఆపరు. కనీసం రోజు ఈ ఆకుల రసాన్ని తాగితే కంటి సమస్యలు దూరం అవుతాయి. అయితే ఆ ఆకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వంటలలో మనం ఎక్కువగా వాడేది కొత్తిమీర, కరివేపాకు ప్రతి ఒక్క కూరల్లో వీటిని వంటలలో వాడుతారు.
ముఖ్యంగా కొత్తిమీర అన్ని వంటలలో వాడుతారు.అలాగే కొత్తిమీర వైద్యశాస్త్ర పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం కొత్తిమీర ను తీసుకుంటే అందులో 3 గ్రాముల మాంసకృత్తులు, రెండు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. అలాగే విటమిన్ సి 130 గ్రాములు, క్యాల్షియం 180 గ్రాములు ఉంటుంది. అంటే పాలలో కంటే కొత్తిమీర లోనే క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది. కొత్తిమీరలో ముఖ్యంగా కంటిచూపును పెంచే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది. కనుక ప్రతిరోజు ఉదయాన్నే కొత్తిమీర ఆకులను జ్యూస్ గా చేసుకోని త్రాగడం వలన కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అలాగే డయాబెటిస్ రావడానికి కారణం ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ శరీరంలో తక్కువగా ఉంటే డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అయితే ఈ కొత్తిమీర బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరను రోజు తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు రావు.
అందుకే ప్రతి కూరల్లో దీనిని వినియోగించుకోవచ్చు. అలాగే కొత్తిమీర లో ఉండే ఫార్మేటోలియిక్ యాసిడ్ మన బాడీలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కనుక రోజు కొత్తిమీర ను తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. కొత్తిమీరను ఎక్కువ సేపు నూనెలో వేయించకూడదు. దానివలన వాటిలో ఉండే అన్ని పోషకాలు నశిస్తాయి. కనుక వీలైనంత వరకు ఉదయాన్నే కొత్తిమీర జ్యూస్ ను త్రాగడం మంచిది. అలాగే కొత్తిమీర లో ఉండే పెట్రోసిలీనిక్ యాసిడ్ అనేది మన శరీర సౌందర్యాన్ని పెంచుతుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు రాకుండా చేస్తుంది.అలాగే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. కనుక కొత్తిమీరను ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో వాడండి. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. కనుక ప్రతిరోజు కొత్తిమీరను వినియోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది.