Diabetes : డయాబెటిస్ లకు శుభవార్త… ఇక అన్నం తినేందుకు భయపడకండి…
Diabetes : డయాబెటిస్ తో బాధపడేవారు అన్నాన్ని ఎక్కువగా తినకూడదని వైద్యశాస్త్ర నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నం ఎక్కువగా తింటే శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు వలన మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు డయాబెటిస్ బాధితులను అన్నం ఎక్కువగా తినకూడదని చెప్తారు. ఎందుకంటే మనం బియ్యము సరిగ్గా ఉడికించకపోవడం వలన ఇలా జరుగుతుంది. మన భారతీయులలో ఎక్కువమంది అన్నం ను తినడానికి ఇష్టపడతారు. కానీ అన్నం తినడం వలన శరీరానికి హాని చేకూరుతుంది. అలా అని పూర్తిగా అన్నం తినటం మానేయకూడదు. అన్నం ను సరిగ్గా ఉడికించకపోవడం వలన డయాబెటిస్ బాధితులు అధికంగా బరువు పెరుగుతారు.
ఎందుకంటే సరిగ్గా ఉడకని అన్నం తింటే దానిలోని హానికరమైన మూలకం ఆర్సెనిక్ శరీరంలోకి వెళుతుంది. ఈ ఆర్సెనిక్ అనేది ఒక రసాయనం. దీనిని ఎక్కువగా పురుగుల మందుగా ఉపయోగించబడుతోంది. ఈ ఆర్సెనిక్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు వాంతులు, కడుపునొప్పి, అతిసారం లేదా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బియ్యంలో ఆర్సెనిక్ తొలగిపోయేలా అన్నాన్ని వండుకోవాలని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా వండుకోవడం వలన డయాబెటిస్ బాధితులకు ఎటువంటి హాని జరగదు. అయితే ఇప్పుడు డయాబెటీస్ బాధితులకు ఎలా అన్నం ను వండుకోవాలి తెలుసుకుందాం.. ముందుగా బియ్యాన్ని బాగా ఉడకపెట్టాలి. ఆ తరువాత అందులోని గంజిని తీసివేయాలి. తర్వాత మరోసారి సరిపడ నీళ్లను పోసి ఉడికించుకోవాలి.
ఇలా ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. తక్కువ మంట మీద అన్నంను వండుకోవాలి. బియ్యం వీటిని బాగా పీల్చుకున్నాక గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా బియ్యం వండినట్లయితే వైట్ రైస్ నుండి 70% ఆర్సెనిక్ తొలగించబడుతుంది. బ్రౌన్ రైస్ లో 50 శాతం వరకు ఆర్సెనిక్ తొలగించబడుతుంది. ఈ విధంగా అన్నం వండుకుంటే ఆర్సెనిక్ ను తొలగించడమే కాకుండా వివిధ రకాల రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ అన్నం వండే ఈ పద్ధతికి సైంటిస్టులు ఫార్బాయిలింగ్ విత్ అబార్షన్ మెథడ్ అని పేరు పెట్టారు. దీనిని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ కనుగొన్నారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్లో ప్రచురించబడిన పరిశోధనలో ఈ PBA పద్ధతి వివరించబడింది. ఈ విధంగా అన్నాన్ని వండుకుంటే ఎటువంటి హానీ జరగదు. డయాబెటిక్ బాధితులు భయం లేకుండా అన్నం తిన వచ్చు.