Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే ఏమౌతుంది? అసలు.. ఎందుకు పరగడుపున నీళ్లు తాగాలి?
Drinking Water : మంచి నీళ్లు.. ఇవి లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. నిజానికి.. మన శరీరానికి మంచి నీళ్లు చేసేంత మంచి.. ఇంకేవీ చేయవు. రోజూ తగినంత మంచినీళ్లు తాగితే చాలు.. సగం రోగాలు తగ్గుతాయి అంటారు డాక్టర్లు. అయితే.. మంచి నీళ్లు ఎప్పుడు తాగాలో కూడా తెలుసుకోవాలి. ఏ సమయంలో తాగితే మంచిదో ఆ సమయంలోనే మంచినీళ్లను తాగితే.. ఇంకా మరిన్ని ఫలితాలు లభిస్తాయి. మంచి నీళ్లను ఎప్పుడు తాగాలి? ఏ సమయంలో తాగాలి? పరగడుపున తాగాలా? పరగడుపున తాగితే ఏమౌతుంది? ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అలాగే.. చాలామందికి ఉండే ఇంకొన్ని డౌట్లు ఏంటంటే.. ఉదయం పూట అంటే.. ఉదయం పూట ఎప్పుడు తాగాలి? ముఖం కడుక్కొని తాగాలా? లేక.. ముఖం కడుక్కోకముందే తాగాలా? టిఫిన్ తిన్నాకా తాగాలా? మంచి నీళ్లకు బదులు.. వేరే పదార్థాలు తీసుకోవచ్చా? జ్యూస్ లు తాగొచ్చా? పండ్ల రసాలు తాగొచ్చా? లాంటి డౌట్లు చాలామందికి ఉంటాయి.
Drinking Water : ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే శరీరంలో జరిగేది ఇదే
ఖాళీ కడుపుతో.. పరగడుపున మంచినీళ్లు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి పోతాయి. వ్యర్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. ఎందుకంటే.. ఉదయం లేవగానే.. కడుపు ఖాళీగా ఉంటుంది. ఒక గ్లాస్ కానీ.. రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగగానే.. మంచి నీళ్లు.. లోపల ఉన్న చెత్తా చెదారాన్ని అంతా బయటికి పంపిస్తుంది. విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.
అలాగే.. పేగుల్లో గడ్డ కట్టుకుపోయిన మలం మొత్తం.. మంచి నీళ్లు తాగగానే.. విరేచనం సాఫీ అయి.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. నిత్యం లేవగానే కాసిన్ని మంచినీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు మలబద్ధకం సమస్య అస్సలు రాదు. అయితే.. ఉదయం లేవగానే ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. ఇక్కడ కొలత అంటూ ఏమీ ఉండదు. తమకు తోచినన్ని మంచినీళ్లను తాగొచ్చు.
ఉదయం పూట నీళ్లు తాగితే.. పేగు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఉదర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. అయితే.. ఉదయం మంచినీళ్లు తాగే వాళ్లు.. కాస్త గోరు వెచ్చని నీటిని తాగండి. అవి ఇంకా మంచిది. గోరు వెచ్చని నీటిని తాగితే.. బరువు తగ్గుతారు. పేగులు, ఇతర అవయవాలన్నీ శుభ్రం అవుతాయి. మూత్రపిండాలు, కాలేయం శుభ్రం అయి.. వాటి పనితీరు మెరుగుపడుతుంది. చాలామంది అప్పుడప్పుడు డీహైడ్రేట్ అవుతుంటారు. అలాంటి వాళ్లు రోజూ ఉదయాన్నే మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే.. డీహైడ్రేషన్ సమస్యే రాదు.
ఇది కూడా చదవండి ==> Diabetes : ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
ఇది కూడా చదవండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
ఇది కూడా చదవండి ==> మీకు బట్టతల ఉందా? ఈ పని చేశారంటే మీరు వద్దన్నా కూడా తలపై జుట్టు మొలుస్తుంది..!
ఇది కూడా చదవండి ==> తొక్కే కదా అని తీసేస్తే మీకే నష్టం.. అరటి తొక్క వల్ల కలిగే లాభాలు ఇప్పుడే తెలుసుకోండి..!