Peas : బఠానీలు తింటే కొవ్వు కరుగుతుందా..? దీంతో బరువు తగ్గవచ్చా..??
ప్రధానాంశాలు:
Peas : బఠానీలు తింటే కొవ్వు కరుగుతుందా..? దీంతో బరువు తగ్గవచ్చా..??
Peas : చలికాలంలో బఠానీలు పటపటమని కొరుక్కుతుంటే ఆ కిక్కే వేరు. ఇక ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్ కావాల్సినంత ఉంటుంది. తెల్ల బఠానీలు తింటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను స్వీకరించడానికి కూడా దోహదం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలక పాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బఠానీలలో విటమిన్ బి ఉంటుంది. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో ఈ బఠానీలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. బఠానీలు తినడం వలన మజిల్ టిష్యూస్ ప్రిపేర్ అవ్వడానికి మరియు రీ బిల్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి.
నిజానికి వర్కౌట్స్ చేసిన తర్వాత మజిల్ టిష్యూస్ పర్ఫెక్ట్ గా మారడానికి కాస్త సమయం పడుతుంది. అలాంటప్పుడు బఠానీలు కనుక తీసుకుంటే చాలా సహాయపడుతుంది. ఎప్పుడైతే మజిల్ టిష్యూస్ చిరిగిపోతాయో బఠానీలలో ఉండే ప్రోటీన్ వెంటనే ఎమినో యాసిడ్స్ ను అందిస్తుంది. దీంతో మజిల్ టిష్యూస్ మెరుగుపడతాయి. అలాగే పచ్చి బఠానీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి బఠానీలు తీసుకుంటే అలసిపోయినట్లు అనిపించదు. పైగా దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి డైట్ ప్లాన్ లో అయినా బఠానీలను తీసుకోవచ్చు. దీనిలో ఎటువంటి పదార్థాలు ఎలర్జీలకు గురి చేయవు. బఠానీల వలన కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. దాంతో గుండెకు సంబంధించిన జబ్బు లు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ఇక కిడ్నీల ఆరోగ్యానికి కూడా బఠానీలు ఉపయోగపడతాయి. ఈ బటానీలను తింటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటాం. దాంతో ఆహారం కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు బఠానీ లను తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా బఠానీలు ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. దాంతో బ్లడ్ సర్కులేషన్ సరైన విధంగా జరుగుతుంది. ఎముకలు బలంగా కూడా ఉంటాయి. బఠానీలను తీసుకోవడం వలన అనారోగ్యపు కొవ్వు పదార్థాలు చేరకుండా ఉంటాయి. వీటిని డైట్ లో భాగంగా తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి అనిపించదు. పైగా శక్తి కూడా లభిస్తుంది.